బాలినేని పై తేల్చేసిన పవన్ - వాట్ నెక్స్ట్..!!

ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ఏడాది పాలన పైన టీడీపీ ప్రజల్లోకి వెళ్లింది. టీడీపీకి కౌంటర్ గా వైసీపీ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. జగన్ లక్ష్యం గా కూటమి రాజకీయం చేస్తోంది. తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతుంటే.. ఎలా వస్తారో చూస్తామని పవన్ సవాల్ చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి జనసేనలో చేరిన జగన్ సన్నిహితుడు బాలినేని పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, ఇప్పుడు పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా అనే చర్చ మొదలైంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది..

పవన్ సభలో
వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి.. జగన్ బంధువు బాలినేని జనసేనలో చేరినా రాజకీయంగా ప్రయోజనం కనిపించటం లేదు. ఇప్పటి వరకు ఒంగోలులో కూటమి నేతలు బాలినేని తో కలిసి పని చేసేందుకు ముందుకు రావటం లేదు. బాలినేని కూటమిలోకి రావటాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే, పవన్ పైన నమ్మకంతో బాలినేని జనసేనలో కొనసాగుతున్నారు. బాలినేనికి పదవి ఇస్తారనే ప్రచారం సాగినా.. ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించ లేదు. కాగా, తాజాగా పవన్ మార్కాపురం సభలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

dy-cm-pawan-key-assurance-for-balineni-political-future-in-janasena

కలిసి పని చేయండి
మార్కాపురం సభలో వేదిక పైన బాలినేని కూర్చోవటం చర్చనీయాంశంగా మారింది. సభలో పవన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు ఆత్మీయు డని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆయన వైసీపీలో ఉన్నా వ్యక్తిగతంగా ఆయనతో తనకు గొడవలు లేవన్నారు. గత ప్రభుత్వంలో కూడా కొన్ని సందర్భాల్లో బాలినేని తనకు అండ గా నిలిచారని తెలిపారు. సమస్యలపై అవగాహ న ఉన్న వ్యక్తి అని, రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే ఆయనను జనసేనలోకి ఆహ్వానించానని, కుటుంబంలోకి కొత్త వ్యక్తి వస్తే కొన్ని సమస్యలు వస్తాయని సరిదిద్దుకోవాలని సూచించారు. కూటమిలో అందరూ కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

పవన్ మాట అమలయ్యేనా
2019- 24 వరకు చోటు ప్రకాశం జిల్లా లో చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు బాలినేని తో కలిసి పని చేసేందుకు టీడీపీ నేతల సుముఖంగా లేరు. ఒంగోలు కేంద్రంగా బాలినేని కారణంగా తమ పార్టీ నేతలు ఇబ్బందులు పడ్డారని టీడీపీ నేతలు చెబుతున్నారు. బాలినేనికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం సాగినా.. ఇప్పటి వరకు ఆ ప్రస్తావన లేదు. ఈ సమయంలో పవన్ కూటమి నేతలకు చేసిన సూచన టీడీపీ జిల్లా ముఖ్యులు అమలు చేస్తారా అనేది సందేహంగా కనిపిస్తోంది. బాలినేని తనకు గుర్తింపు లేకపోవటం.. పట్టించుకోవటం లేదనే ఆవేదనతో ఉన్నారని గుర్తించిన పవన్ తన సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, బాలినేని విషయంలో టీడీపీ నేతల వైఖరి ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+