Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీరు మాట్లాడాల్సిన మాటలేనా అవి

YS Jagan and Chandrababu Naidu: రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచారం తీవ్రతరమౌతోంది. వాతావరణం వేడెక్కుతోంది. నాయకుల మధ్య వాగ్యుద్ధాలకు అంతే ఉండట్లేదు. మాటల తూటాలు పేలుతున్నాయి. యథేచ్ఛగా పరస్పర ఆరోపణలు, విమర్శలు సంధించుకుంటోన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ ఇద్దరు అధినేతలు కూడా పరస్పరం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. సైకో, మాయల ఫకీర్.. అంటూ విమర్శలు గుప్పించుకుంటోన్నారు.

ECI has censures CM YS Jagan and Chandrababu Naidu

దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వారి ప్రసంగాలు, అందులో ప్రయోగించిన భాష, వాడిన పదాల పట్ల ఆగ్రహించింది. ఇద్దరూ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. వారిద్దరికీ తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది.

జగన్‌ను సైకోగా చంద్రబాబు అభివర్ణించడాన్ని ఈసీ తప్పు పట్టింది. ఆ సైకో చెబితే ఈ సైకో ఎగురుతున్నాడు.. నేను అనుకుంటే నీ తోక కట్ చేయడానికి ఒక్క నిమిషం చాలు..శ్రీరాముడు రావణాసురుడిని చంపాడు, మీరేం చేయాలి? జగనాసురుడిని ఏం చేస్తారు? మీరు? అంటూ గతంలో చంద్రబాబు విమర్శించారు.

అదే సమయంలో జగన్ కూడా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ పెద్ద మనషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక శాడిస్టా అని అడుగుతూ ఉన్నా ఈ సందర్భంగా.. అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చింది.. అంటూ పూతలపట్టు సభలో ఆరోపించారు.

ఈ ప్రసంగాలపై ఈసీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్.. జగన్, చంద్రబాబుకు నోటీసులు పంపించారు. ఎన్నికల ప్రవ్తన నియమావళిని ఉల్లంఘించేలా ప్రసంగించవద్దంటూ హెచ్చరించారు. గతంలో కూడా తాము నోటీసులు జారీ చేసినప్పటికీ తమ ప్రసంగాల తీరును మార్చుకోలేదని గుర్తు చేశారు. రాజకీయ ప్రసంగాల గౌరవాన్ని నిలబెట్టడం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం బాధ్యత అని హితవు పలికారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+