సీఎం జగన్ పై దాడి, ఈసీ సీరియస్ - కేంద్రం ఆరా..!!
ముఖ్యమంత్రి జగన్ పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన ప్రాధమిక సమాచారం సేకరించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేంద్రం సైతం ముఖ్యమంత్రి పై దాడి అంశం పైన ఆరా తీసినట్లు సమాచారం. రాజకీయ ప్రమేకంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది.
ఈసీ సీరియస్
ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో రాయితో దాడి చేయటం పైన ఎన్నికల సంఘం స్పందించింది. జగన్ బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలో వివేకానంద స్కూల్ వద్ద ఈ దాడి జరిగింది. జగన్ కంటి పైన గాయం అయింది. వెంటనే వైద్యులు ప్రాధమిక చికిత్స చేసారు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రిలో జగన్ గాయానికి కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జగన్ పక్కనే బస్సు పైన ఉన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్ది వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయం అయింది. జగన్ పైన దాడి జరటం..గాయం కావటంతో ప్రధాని మోదీ సహా మమతా బెనర్జీ, స్టాలిన్,చంద్రబాబు స్పందించారు. జగన్ కోలుకోవాలని ఆకాంక్షించారు.

నివేదిక ఇవ్వండి
ఇటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన దాడి జరగటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన నివేదిక ఇవ్వాలని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణాను ఎన్నికల సీఈవో మీనా కోరారు. ఇప్పటికే ఈ ఘటన కు సంబంధించి పోలీసు అధికారులు ఎన్నికల సీఈవోకు ప్రాధమిక సమాచారం అందించారు. జీవో వాయిలెన్స్ ఎన్నికలే టార్గెట్ గా పని చేస్తున్న సమయం లో ఈ రకమైన దాడులను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఘటన జరిగిన ప్రాంతాన్ని కమిషనర్ కాంతి రాణా పరిశీలించారు. సమీపంలోని వివేకానంద స్కూల్ నుంచి అగంతకుడు ఈ రాయి దాడి చేసినట్లు ప్రాధమికంగా నిర్దారణక వచ్చారు.

పోలీసుల విచారణ
ఇదే సమయంలో ముఖ్యమంత్రికి సంబంధించి ఎక్కడైనా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. టీడీపీ చేసిన కుట్రగా వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గాయం కారణంగా సీఎం జగన్ ఈ రోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటన పైన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసారు. సమీపంలోని స్కూల్ నుంచి దాడి జరిగినట్లుగా భావిస్తున్న అధికారులు అక్కడి సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications