వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌రో రెండు కేంద్రాల్లో: అక్క‌డా రేపే రీ పోలింగ్‌: చ‌ంద్ర‌గిరిపై ఈసీ తాజా నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

చ‌ంద్ర‌గిరిలో మ‌రో రెండు కేంద్రాల్లో రీ పోలింగ్‌ || Oneindia Telugu

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మరో రెండు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అయిదు పోలింగ్ కేంద్రాల‌తో పాటుగా ఈ రెండు కేంద్రాల్లోనూ ఆదివారం పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ సారి రీ పోలింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఐఏయ‌స్ అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

చంద్రిగిరిలో మ‌రో రెండు కేంద్రాల్లో...
చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 19న రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం ఇప్పటికే నిర్ణ‌యించింది. అయితే, త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన సీఈవో మ‌రో రెండు కేంద్రాల్లోనూ రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సిఫార్సు చేసారు. దీంతో..ఆ అయిదు కేంద్రాల‌తో పాటుగా మ‌రో రెండు కేంద్రాలు క‌లిపి మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో 19న రీ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 11న ఇక్క‌డ పోలింగ్ స‌మ‌యంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకున్న ఎన్నిక‌ల సంఘం రీ పోలింగ్ స‌మ‌యంలో ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఐఏయ‌స్ అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదే విధంగా ఐపిఎస్ అధికారి స్థాయిలో బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని ఈసీ ఆదేశించింది.

Election Commission ordered Re polling in another two centers in Chandragiri...

ప్ర‌తీ బూత్ వ‌ద్ద 250 మంది పోలీసులు..
ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఎన్నార్ క‌మ్మ‌ప‌ల్లి, పులివ‌ర్తివారి ప‌ల్లె, కొత్త‌కండ్రిగ‌, క‌మ్మ‌ప‌ల్లి, వెంట్రామాపురంతో పాటుగా కాలూరు, కుప్పం బాదురుల లో రీ పోలింగ్‌కు ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. చంద్ర‌గిరి రీ పోలింగ్ వ్య‌వ‌హారం పైన రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న ప‌రిస్థితుల్లో ఇక్క‌డి ప‌రిస్థితుల పైన ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నామని కలెక్టర్‌ ప్రద్యుమ్న చెప్పారు. చంద్రగిరి పరిధిలో మొత్తం ఏడు చోట్ల నిర్వహించే రీపోలింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద 250 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. రీపోలింగ్‌కు కేంద్రాలలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్‌ ఉంటుందని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేసారు.

English summary
Election Commission ordered Re Polling in another two polling booths in Chandragiri constituency. Previously decided Re poll in five booths, now addition to that another two booths added. Re polling will be conduct on 19th may.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X