టీవీ చూసేందుకు వస్తే ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏలూరు:టీవీ చూసేందుకు వచ్చిన ఎనిమిదో తరగతి చదివే విద్యార్థినిని ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడు ఓ యువకుడు. నిందితుడికి పదేళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన గ్రామానికి ఓ విద్యార్థిని ఎదనిమిదో తరగతి చదువుతోంది.అయితే అదే మండలంలోని ఔరంగబాద్ కు చెందిన గెడ్డం నవీన్ అనే యువకుడి ఇంటికి ఆ బాలిక టీవీ చూసేందుకు వెళ్ళింది.

అయితే టీవీ చూసేందుకు వెళ్ళిన బాలికను ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడు. కొద్ది రోజుల తర్వాత బాలిక కడుపునొప్పి వస్తోందని తల్లిదండ్రులకు చెప్పింది.

rape

ఆమెను ఆసుపత్రికి 2015 ఏప్రిల్ 2న, తీసుకెళ్ళారు.అయితే బాలిక గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఆ విద్యార్థిని నుండి వివరాలు తెలుసుకొన్న ఆమె కుటుంబసభ్యులు కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్ఐ గంగాభవాని కేసు నమోదు చేయగా కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వర్ రావు కేసు దర్యాప్తు చేసి నిందితుడైన నవీన్ ను అరెస్టు చేశారు.

ఈ కేసు ఏలూరులోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచాణ సాగింది. నిందితుడైన నవీన్ పై నేరం రుజువు కావడంతో పదేళ్ళ జైలు శిక్షతో పాటు పదివేల రూపాయాల జరిమానాను విధిస్తూ జడ్జి కె.సాయిరమాదేవి తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూటర్ ఎల్. అజయ్ ప్రేమ్ కుమార్ వాదిచగా ప్రాసిక్యూషన్ కు కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వర్ రావు , కొవ్వూరు సీఐ ప్రసాదరావు, కోర్టు కానిస్టేబుళ్ళు సహకరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
eluru court ordered to naveen kumar 10 years jail. naveen raped on minor girl on 2015.she was pregnant.
Please Wait while comments are loading...