Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు- పవన్‌పైనే అందరి దృష్టి: ఏ మాయ చేస్తారో..?!

Visakhapatnam Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది.

బేఖాతర్..

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ వచ్చింది.

Employees and workers of Visakhapatnam Steel Plant hold Maha Dharna protest today

దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్..

అయిదు దశాబ్దాలకుపైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తోన్న స్టీల్ ప్లాంట్ ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి.

ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరం..

అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్‌‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచనప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలను అందజేసింది.

2003లో బిడ్స్ ఆహ్వానం..

కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం.

టీడీపీ కూటమిపై

ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకుంది. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

Employees and workers of Visakhapatnam Steel Plant hold Maha Dharna protest today

కుమారస్వామి సమీక్షతో వేడి..

ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. దూకుడు పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.

ఆందోళనతో..

ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డెక్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినదించారు.

అన్నపూర్ణ మూసివేత..

అయినప్పటికీ- వాటిని లెక్క పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వం. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరో బ్లాస్ట్ ఫర్నేస్ మూత పడింది. అన్నపూర్ణ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మూసివేసింది. ఈ ఏడాది మార్చిలో గోదావరి బ్లాస్ ఫర్నేస్ నంబర్ 1 కూడా మూతపడిన విషయం తెలిసిందే.

బొగ్గు స్టాక్ లేదు..

ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి వస్తువులు, బొగ్గు, ఇతర పరికరాల సరఫరా చాలినంతగా లేకపోవడం వల్ల అన్నపూర్ణ బ్లాస్ట్ ఫర్నేస్‌‌ను మూసివేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గుతో ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ కృష్ణ ఒక్కటే. ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు కూడా అయిదారు రోజులకు మించి ఉండబోవని సమాచారం.

నేడు మహా ధర్నా..

ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నేడు ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు మహా ధర్నా నిర్వహించనున్నారు. గాజువాకలో మహా ధర్నా పోస్టర్‌ను సీపీఎం నగర కార్యదర్శి, స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ బీ గంగారావు ఇదివరకే విడుదల చేశారు. ఉత్పత్తి ఆగిపోతే బ్లాస్ట్ ఫర్నేస్‌ల బ్యాటరీ డెడ్ అవుతుందని, దీన్ని పునరుద్ధరించడానికి వేల కోట్లు ఖర్చవుతుందని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+