Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పై అనర్హత వేటు ఇలా..! రూల్ తో సహా చెప్పేసిన మాజీ స్పీకర్..!

ఏపీలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై చర్చ జరుగుతూనే ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ ను రప్పించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా ప్రభుత్వ పెద్దలు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఓ దశలో జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత వేటు వేస్తామని, దీంతో పులివెందులకు ఉపఎన్నిక వస్తుందంటూ బెదిరింపులకు కూడా దిగారు. అయినా ఆయన మాత్రం ససేమిరా అంటూ ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో అసలు జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయనపై ఏ నిబంధన కింద అనర్హత వేటు వేస్తారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు వంటి వారే అసెంబ్లీకి రాకుండా బహిష్కరించారని, వారిపై పడని అనర్హత వేటు తనపై ఎలా పడుతుందంటూ జగన్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఇవాళ స్పందించారు. జగన్ పై అసెంబ్లీకి రానందుకు అనర్హత వేటు ఎలా పడుతుందో రూల్ ప్రకారం వెల్లడించారు.

Ex-AP Speaker Yanamala ramakrishunudu Explains How CM Jagan Could Face Disqualification

జగన్ వరుసగా అసెంబ్లీకి రాకుండా ఉండిపోవడంపై స్పందించిన మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు.. ముందుగా ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, ఆర్టికల్ 190(4) చదువుకోవాలని సూచించారు. ఆ నిబంధనలు అర్దం చేసుకుంటే జగన్ కు సందేహాలు రావని యనమల తెలిపారు. ఒకవేళ అవి అర్దం కాకపోతే న్యాయవాదుల్ని అడగాలని కూడా జగన్ కు ఆయన సూచించారు.

Ex-AP Speaker Yanamala ramakrishunudu Explains How CM Jagan Could Face Disqualification

ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయొచ్చని యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పేశారు. అంతే కాదు, ఇలా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా లేదా అనేది కూడా కోర్టు తేల్చాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం అనర్హత వేటు పరిధిలోకి వస్తుందని యనమల స్పష్టం చేశారు. కాబట్టి జగన్ అసెంబ్లీకి రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+