పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్, మీ ఏడుపే మా ఎదుగుదలంటూ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏమాత్రం చిన్న అవకాశం దొరికిన వైసీపీ నేతలు ఎన్డీఏ కూటమి నేతలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేన పొత్తుతో గద్దెనెక్కిన టిడిపి కూటమిపై, అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు.
పవన్ కళ్యాణ్ పై అంబటి షాకింగ్ ట్వీట్
తాజాగా అంబటి రాంబాబు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను తన పోస్టులో అంబటి రాంబాబు ట్యాగ్ చేశారు.

అంబటి రాంబాబును టార్గెట్ చేస్తున్న జనసేన నాయకులు
ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కేవలం బాబు కోసమే పుట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోస్ట్ చేయడం జనసేన కార్యకర్తలకు, నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో వారు అంబటి రాంబాబును టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జగనన్న దగ్గర పాలేరు జీవితాన్ని అనుభవిస్తున్న మీకు ఇదే ఆహ్వానం అంటూ జనసేన కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.
మీ ఏడుపే మా ఎదుగుదల అంటూ రివర్స్ ఎటాక్
రండి మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు మీకు కాస్త కక్క బువ్వ పెడతామంటూ పోస్టులు చేస్తున్నారు. ఇక మరికొందరు మీ ఏడుపే మా జనసేన ఎదుగుదల ఇంకా గుక్క పెట్టి ఏడవండి ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోకుండా ఎందుకు మీకు ఇలాంటి ట్వీట్స్ అంటూ టార్గెట్ చేస్తున్నారు. బాబుని లేపేసి శవాల మీద పుట్టిన పార్టీకి కూడా ఆవిర్భావ దినోత్సవ ఆలస్య శుభాకాంక్షలు అంటూ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు.
12 ఏళ్ళ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడుతున్న నాయకులు
ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వైసిపి చేస్తున్న విమర్శలకు జనసేన నాయకులు ఘాటుగానే బదులిస్తున్నారు. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ శ్రేణులు 12 ఏళ్ళ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని చర్చిస్తున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పవన్ పట్టుదలతో సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications