మాజీ మంత్రి రోజా కనబడుట లేదు. మీకేమైనా తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీ సీఎం గా చంద్రబాబు అధికారం చేపట్టి రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మాటల దాడి చేస్తున్నారు.
రోజా సైలెంట్
ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేసి ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా అడపా దడపా సోషల్ మీడియాలో పోస్టులు మినహాయించి మాజీమంత్రి రోజా మాత్రం దీనిపైన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చీటికిమాటికి నోరేసుకొని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన రోజా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

నగరిలో రోజా పరిస్థితి ఇది
ఎన్నికల్లో ఓటమి తర్వాత నెల రోజులపాటు నగరిలోని ఇంటికి మాత్రమే పరిమితమైన రోజా, ఇక వీకెండ్స్ లో అప్పుడప్పుడు చెన్నైలోని ఆలయాలకు వెళుతూ కాలం గడుపుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఒకటి రెండు సార్లు మాత్రమే నగరిలో పార్టీ కార్యక్రమాలకు రోజా హాజరయ్యారు. నగరిలోనూ సొంత పార్టీలో ఆమెకు అడుగడుగునా శత్రువులే..
రోజా కోసం కాచుకు కూర్చున్న శత్రువులు
అంతకుముందు మీడియాతో మాట్లాడడానికి తెగ ఉబలాటం చూపించే రోజా ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి కూడా ఏమాత్రం ఇష్ట పడటం లేదు. రోజా చిన్న మాట మాట్లాడినా, చిన్న పని చేసినా టిడిపి, జనసేన శ్రేణులే కాదు సొంత పార్టీ నాయకులు కూడా ఆమెను టార్గెట్ చేయడానికి కాచుకు కూర్చున్నారు దీంతో రోజా దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
రోజా కనబడుట లేదు .. వారికి బాధ
ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఆలయాలకు తిరుగుతున్న రోజా ఇటీవల తమిళనాడులోని ఒక ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదం కావడంతో ఆమె పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. రోజా మాట్లాడినా, మాట్లాడకపోయినా రోజాను రోజా వ్యతిరేకులు మాత్రం వదిలేలా లేరు. ఆమె కనుబడుట లేదని తెగ బాధ పడుతున్నారు. రోజా గురించి మీకేమైనా తెలుసా అని సెటైర్లు వేస్తున్నారు.
రోజా రాజకీయ భవిష్యత్ ఏంటి ?
నోటి దురుసు వ్యాఖ్యలతో రోజా పెంచుకున్న శత్రుత్వం అలాంటిది. ప్రస్తుతం రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్న రోజా రాజకీయ భవిష్యత్తు పైన రకరకాల చర్చ జరుగుతోంది. రోజాకు వైసిపిలో ఉండలేని, అలా అని ఏ పార్టీలోకి వెళ్లలేని విచిత్రమైన పరిస్థితి వచ్చి పడింది. మరి రోజా భవిష్యత్తు కార్యాచరణ ఏంటో.. ఆమె రాజకీయ ప్రయాణం ఏ విధంగా సాగబోతుందో ఆమె మాట్లాడితే కానీ తెలిసేలా లేదు.












Click it and Unblock the Notifications