Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహేష్ బాబు బావ షాకింగ్ కామెంట్స్.. మళ్లీ టీడీపీలోకి వస్తానంటూ !

మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పవిత్ర స్థలం కాణిపాకం వినాయక స్వామి ఆలయాన్ని దర్శించిన గల్లా జయదేవ్, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

దేవుడు కరుణిస్తే రాజకీయాల్లోకి తిరిగి వస్తా..

తెలుగుదేశం పార్టీ నుంచే మళ్లీ తన ప్రయాణం మొదలవుతుందని జయదేవ్ స్పష్టం చేశారు. అవసరమైతే రాజ్యసభకు కూడా వెళ్తానని అన్నారు. అలాగే ప్రస్తుతం పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అది పార్టీ ఆశయాలకు, తన వ్యక్తిగత బాధ్యతలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం ప్రత్యేకమైనదని,, పార్టీ కోసం గతంలో పనిచేసిన విధానాన్ని ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేశారు. తన రాజకీయ పునరాగమనం పార్టీ అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ex-mp-galla-jayadev-shocking-comments-on-political-re-entry

ఆ కారణం గానే..

గతంలో వ్యాపారాలకు పూర్తిగా సమయం కేటాయించేందుకు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరమించుకున్నారు. 2023లో అధికారికంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ ప్రస్థానం..

గల్లా జయదేవ్ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి ప్రారంభమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ వేదికగా ఆయన ప్రసంగాలకూ మంచి గుర్తింపు లభించింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంట్‌ వేదికగా ఆయన పోరాటం గుర్తుండిపోయేలా సాగింది. అలానే 2019 ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించారు.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్..

గల్లా జయదేవ్ తండ్రి గల్లా రామచంద్రనాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, అమర రాజా గ్రూప్‌ వ్యవస్థాపకులు. ఆయన 1999లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా సేవలు అందించారు. తల్లి అరుణ కుమారి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె కాంగ్రెసు పార్టీలో మంత్రి పదవులు చేపట్టారు. అందుకే గల్లా కుటుంబానికి రాజకీయంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా మంచి పేరుంది. గల్లా జయదేవ్ భార్య పద్మిని.. ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె. ఆమె కూడా అమర రాజా గ్రూప్‌ లో కీలక పదవుల్లో ఉన్నారు. గల్లా జయదేవ్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు బావమరిది అవుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+