విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ఇదే(వీడియో)
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు కోసం విజయవాడలో క్యాంప్ ఆఫీసు సిద్ధమైంది. సాగునీటి శాఖకు చెందిన భవనంలో ఈ క్యాంప్ కార్యాలయాన్ని 16 కోట్ల రూపాయలతో సిద్ధం చేశారు. అనుకున్న ప్రకారం జూన్ 6వ తేదీనే ఈ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం కావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల రీత్యా క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా పడిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముహూర్తం దాటి పోవడంతో వాయిదా వేశామని జూన్ 8న క్యాంప్ ఆఫీసును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.
విజయవాడలోని నీటిపారుదలశాఖ ఆవరణలో సీఎం కోసం క్యాంప్ ఆఫీస్ (సీఎంఓ)ని నిర్మించారు. సీఎం కోసం ప్రత్యేకంగా భారీ చాంబర్, క్యాబినెట్ సమావేశ మందిరం, ముగ్గురు సీఎంఓ అధికారులు, విజిటర్స్ రూమ్స్, డైనింగ్ హాల్, యాంటీ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు.
సమీక్షా సమావేశాల కోసం నిర్వహణకు అవసరమైన హాల్‌ను కూడా ఏర్పాటు చేశారు. మెట్ల ల్యాండింగ్ వద్ద ప్రత్యేకంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి డెల్టా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కోసం ఆ భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర విభజనతో విజయవాడ రాజధాని కావటంతో ఆ భవనం కాస్తా సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారిపోయింది.

విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు కోసం విజయవాడలో క్యాంప్ ఆఫీసు సిద్ధమైంది. సాగునీటి శాఖకు చెందిన భవనంలో ఈ క్యాంప్ కార్యాలయాన్ని 16 కోట్ల రూపాయలతో సిద్ధం చేశారు. అనుకున్న ప్రకారం జూన్ 6వ తేదీనే ఈ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం కావాల్సి ఉంది.

విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ఇదే
కానీ కొన్ని కారణాల రీత్యా క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా పడిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముహూర్తం దాటి పోవడంతో వాయిదా వేశామని జూన్ 8న క్యాంప్ ఆఫీసును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.

విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ఇదే
విజయవాడలోని నీటిపారుదలశాఖ ఆవరణలో సీఎం కోసం క్యాంప్ ఆఫీస్ (సీఎంఓ)ని నిర్మించారు. సీఎం కోసం ప్రత్యేకంగా భారీ చాంబర్, క్యాబినెట్ సమావేశ మందిరం, ముగ్గురు సీఎంఓ అధికారులు, విజిటర్స్ రూమ్స్, డైనింగ్ హాల్, యాంటీ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు.

విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ఇదే
సమీక్షా సమావేశాల కోసం నిర్వహణకు అవసరమైన హాల్‌ను కూడా ఏర్పాటు చేశారు. మెట్ల ల్యాండింగ్ వద్ద ప్రత్యేకంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి డెల్టా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కోసం ఆ భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర విభజనతో విజయవాడ రాజధాని కావటంతో ఆ భవనం కాస్తా సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారిపోయింది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!

Click it and Unblock the Notifications