శ్రీవారి మెట్టు వద్ద..!!

కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 73,852 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 31,277 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.16 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్ మెంట్టు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

Experience the Spirit of Karthika Masam at the Enchanting Vanabhojanam

కాగా.. పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ఆదివారం శ్రీవారి మెట్టు వద్ద గల పార్వేట మండపంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.

అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.

మరోవంక- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు అదే రోజు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత షోడషోపచారాలు సమర్పించారు. సమస్త విఘ్నాలు తొలగడానికి విష్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత పుణ్యహవచనం చేపట్టారు.

అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మినుముల అన్నం బలిహరణ చేశారు. అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేశారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహించారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, గోష్టి నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+