గంటన్నరలోనే చెన్నై, బెంగళూరుకు.. ఏపీ వాసులకు ఆ ఎక్స్ప్రెస్ వేతో పండుగే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నేషనల్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వే లతో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తుంది కేంద్రం. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. త్వరలోనే ఈ మార్గం అందుబాటులోకి రానుంది.

మూడు రాష్ట్రాలను కలిపే ఎక్స్ప్రెస్ హైవే
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్తూరు జిల్లా వాసులకు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే త్వరలో అందుబాటులోకి రానున్న వార్త నిజంగా ఒక శుభవార్తనే. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నర లోని చెన్నై నుండి బెంగళూరుకు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మూడు రాష్ట్రాలను కలుపుతున్న ఈ ఎక్స్ప్రెస్ హైవే పనులు చకచకా సాగుతున్నాయి.

Expressway connecting AP Chennai and Bangalore an hour and a half journey

Take a Poll

17,980 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం
భారత ప్రధాని నరేంద్ర మోడీ 2022లో ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి ప్రారంభించిన నాటినుండి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. మొత్తం 262 కిలోమీటర్ల పొడవైన ఈ నేషనల్ హైవే నిర్మాణానికి ప్రభుత్వం 17,980 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే చిత్తూరు జిల్లా నుండి బెంగళూరు, చెన్నై నగరాలకు కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

జరుగుతున్న నిర్మాణ పనులు
2026 చివరినాటికి రహదారిని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటక పరిధిలో హోస్ కోట నుండి సుందర పాళ్య వరకు 91 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి పూర్తి కాగా, ప్రస్తుతం సుందర పాళ్య నుండి తమిళనాడు సరిహద్దులోని గుడిపాల వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు బైరెడ్డిపల్లె, చీలాపల్లె, బంగారుపాళ్యం దగ్గర బలిజ పల్లె వద్ద లింక్ రహదారుల నిర్మాణం సాగుతుంది.

2026 చివరినాటికి అందుబాటులోకి ఈ ఎక్స్ప్రెస్ హైవే
భవిష్యత్తులో ఉండే ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ రహదారిని ఎనిమిది వరుసగా విస్తరించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇది ఎన్ హెచ్ 7, బెంగళూరు చెన్నై హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ హైవే గా చెబుతున్నారు. ఈ రహదారి ఆంధ్రప్రదేశ్లో 65 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఏపీలో ఈ రహదారి అందుబాటులోకి వస్తే చెన్నై, బెంగళూరు వెళ్లాలనుకునే వారికి చాలా తక్కువ సమయం లో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. 2026 చివరినాటికి ఈ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+