నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివ ముఠా: జగ్గూ ప్రేమాయణం, ఫేస్‌బుక్ ఖాతాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫేస్‌బుక్ ఖాతాలే గజదొంగ శివ అలియాస్ సాంబ ముఠాను పట్టుకోవడానికి పోలీసులకు సహకరించాయి. శంషాబాద్ సమీపంలో గత శుక్రవారం రాత్రి జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన శివ ముఠా ఆచూకీ ఫేస్‌బుక్ ఖాతాల వల్లనే తెలిసింది. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం - శివ ముఠాలో సభ్యుడైన మండపాటి జగదీశ్ అలియాస్ జగ్గాకు మూడు ఫేస్‌బుక్ ఖాతాలున్నాయి. ఇతనిది కూడా శివ స్వగ్రామమైన నెల్లూరు జిల్లా ఓజిలి మండలం అర్మేనిపాడే. జగదీశ్ 2005 నుంచి శివతో పాటే ఉంటూ చోరీలకు పాల్పడుతున్నాడు. నెల క్రితం వరకు ఈ ముఠా ఖైరతాబాద్‌లోని ఎంఎస్ ముక్తాలో నివాసం ఉండేది.

Facebook accounts helped to nab Shiva

అక్కడే ఓ యువతితో జగ్గూ ప్రేమాయణం సాగించినట్లు సమాచారం. జగదీశ్ ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను పేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. యువతి కుటుంబం పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పట్టుకుంటారనే భయంతో అతను ఇరవై రోజుల క్రితం తన మకం నార్సింగికి మార్చాడు.

ఆ తర్వాత ఆ ఖాతాను మూసేసిన జగ్గూ మరో రెండు ఖాతాలను నిర్వహించాడు. వీటి వివరాల ఆధారంగా పోలీసులు నార్సింగ్ ఇంటి చిరునామాను కనుక్కున్నారు. గత శుక్రవారం రాత్రి ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

శివ భార్య నాగలక్ష్మితో పాటు జగదీశ్, రాజ్ కుమార్ మాత్రం పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. శివ శంషాబాద్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులపై అతను దాడి చేశాడు. కాల్పుల్లు మరణించాడు.

English summary
According to media reports - Jagadish Facebook accounts helped to nab Shiva alias Samba gang at Narsing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X