సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశృతి: అభిమాని కాలుపై నుంచి కారు

కాకినాడ: ఇటీవల విడుదలై సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో ఆదివారం నాడు అపశృతి దొర్లింది. ఈ చిత్ర బృందంలోని కారు ఒక అభిమాని కాలు పైనుంచి వెళ్లడంతో అతని కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో అతనినిసమీప ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

ఈ సంఘటన కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్ద చోటు చేసుకుంది. విజయయాత్రలో భాగంగా ఈ థియేటర్‌కు ఆదివారం ఈ చిత్ర బృందం వచ్చింది. అక్కడే నిలబడి ఉన్న ఓ అభిమానిపై కాలుపై కారు వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది.

వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతని కాలు విరిగినట్టు వైద్యులు చెప్పారు. ఈ చిత్రం హీరో సాయిధరమ్ తేజ, డైరైక్టర్ హరీష్ శంకర్ తదితరులు ఈ విజయయాత్రలో పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్యం ముందుగా ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+