ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్... భవిష్యత్ సీఎం విష్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మంత్రి నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయ ఎదుగుదల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఒకపక్క మంత్రిగా తన మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తున్న లోకేష్ మరోవైపు పార్టీపైన బలమైన ముద్ర వేయడానికి రంగంలోకి దిగారు. ఇందులోభాగంగా ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ అంటూ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు తనతో కలిసి విందుచేసే అవకాశాన్ని ఇచ్చి ఇంటికి పిలిచి గౌరవించి వారందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు ఉన్న పట్టు, చంద్రబాబు నాయుడుకు ఉన్న పేరు, ఆయన సామర్థ్యానికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అటువంటి చంద్రబాబు తన తర్వాత టిడిపిని నడపడానికి, సీఎం పదవిలో కూర్చోవడానికి సమర్థుడైన నాయకుడిగా, తన వారసత్వంగా నారా లోకేష్ ను రాజకీయాలలోకి తీసుకువచ్చారు.

లోకేష్ సామర్ధ్యంపై గతంలో చర్చ.. సీఎం ఆలోచనకు బ్రేక్
అయితే లోకేష్ కు గతంలో రాజకీయంగా పరిణితి లేకపోవడంతో, ప్రతిపక్ష పార్టీలు లోకేష్ ను అసమర్థుడని, పప్పు అని రకరకాలుగా చిత్రీకరించి ప్రజలలోకి తీసుకు వెళ్ళడంతో లోకేష్ సామర్థ్యంపై పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరిగింది. చాలామంది సీనియర్లు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించలేని స్థితి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే లోకేష్ భవిష్యత్తు సీఎం అనే చర్చకు బ్రేక్ వేసి చంద్రబాబు రాజకీయాలు సాగిస్తున్నారు.
రాజకీయంగా పరిణతి సాధిస్తున్న లోకేష్
అయితే రాజకీయంగా పరిణితి సాధించి, అందరి మెప్పు పొంది, పార్టీ పైన పూర్తి పట్టుతో సీఎం అవ్వాలని ఆలోచిస్తున్న లోకేష్ ఈ క్రమంలోనే వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో యువ గళం పాదయాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, నాటి ప్రభుత్వ నిరంకుశత్వానికి ఎదురొడ్డి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేసిన లోకేష్ తన పాదయాత్రతో ప్రజలలో గుర్తించబడ్డారు.
అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఫ్యామిలీ మెంబర్స్ తో డిన్నర్
మంగళగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గం సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, మంత్రిగా తనకు అప్పగించిన శాఖల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పైన దృష్టి సారిస్తున్న లోకేష్ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ ని తన ఇంటికి పిలిచి ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు లోకేష్.
ఆ విష్ తోనే ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్
అందరూ ఎమ్మెల్యేలతోను సన్నిహితంగా ముందుకు వెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కుటుంబ వాతావరణం లో జరిగే ఈ డిన్నర్ సమావేశం ద్వారా వారందరి మద్దతును కూడగట్టుకుంటున్నారు. భవిష్యత్తులో అందరి మద్దతుతో సీఎం అవ్వాలనే విష్ ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ తో ప్రధానంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా లోకేష్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా లేదా అన్నది భవిష్యత్తులో తేలనుంది.
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications