చిత్తూరులో షాకింగ్ ప్రమాదం: పాడె మోస్తూ ముగ్గురు మృతి!!
ఇప్పుడు బాగా మాట్లాడిన వాళ్ళు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోతున్నారు. మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా రక రకాల అనారోగ్య సమస్యలతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా గుండెపోటు వచ్చి మృతి చెందుతున్న వారి సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతుంది.
తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక చనిపోయిన మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన వారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని మోసుకుంటూ స్మశానం వైపు .వెళ్తుండగా పాడె మోసుకుంటూ వెళ్తున్న వారికి విద్యుత్ తీగల రూపంలో మరణం ఎదురైంది. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన మరింత విషాదాన్ని నింపింది.

ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే తంబగాని పల్లెకు చెందిన రాణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్మశానానికి తీసుకు వెళ్ళే సమయంలో కరెంటు స్తంభం నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు పాడెకు తగలడంతో మృతదేహాన్ని మోస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను తిరుపతి, రవీంద్రన్, మునప్పగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మహిళ పాడె మోసి, వీరు చివరికి పాడె ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఊహించని విషాద ఘటనతో చిత్తూరు జిల్లా తంబగాని పల్లెలో అందరూ కన్నీరు మున్నీరయ్యారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications