ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కి ఆమె చీత్కారం: ఆత్మహత్యాయత్నం

సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ప్రణవ్ నీల్ గోక్రె (20)కి వనస్థలిపురం బిఎన్‌రెడ్డినగర్‌లోని ఓ హాస్టల్ ఉంటూ బి.టెక్ చదువుతున్న విద్యార్థినితో సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆమె సెల్ ఫోన్ నెంబర్, అడ్రస్ తీసుకున్న ప్రణవ్ శుక్రవారం నగరానికి వచ్చాడు.
హాస్టల్‌కు వెళ్లగా ఫేస్‌బుక్ మిత్రురాలు నువ్వు ఎవరో తెలియదని అంటూ ఛీత్కరించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రణవ్ నెయిల్ పాలిష్ రిమూవర్‌ని తాగాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన అతడ్ని హాస్టల్ వాచ్‌మెన్ గుర్తించి పోలీసులకు సమచారం అందించారు.
అతనికి ప్రాథమిక చికిత్స అందించడంతో స్పృహలోకి వచ్చాడు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రణవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications