మనపై ఫెంగల్ తుఫాన్ పంజా
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్.. రెండు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంపై పంజా విసురుతోంది. తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిల్లో అల్లకల్లోలం రేపుతోంది. ప్రత్యేకించి- తమిళనాడు, పుదుచ్చేరిలపై దీని ప్రభావం అతి తీవ్రంగా ఉంటోంది. భారీ వర్షాలకు కారణమౌతోంది.
తమిళనాడు, పుదుచ్చేరిల్లో మూడు- నాలుగు రోజులుగా అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవును సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పుదుచ్చేరికి ఈశాన్య దిశగా 150, చెన్నైకి 140, నాగపట్నానికి 210, శ్రీలంకలోని ట్రింకోమలికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై కనిపించింది.
ఈ మధ్యాహ్నం తమిళనాడు ఉత్తర ప్రాంతం- పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్- మామళ్లాపురం మధ్య తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలుల తీవ్రవ గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వరకు పెరుగుతుందని పేర్కొంది.
దీని ప్రభావం.. ఇప్పటికే తమిళనాడుపై పడింది కూడా. చెన్నైలో శుక్రవారం సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కాళ్లకురిచి, కడలూర్ జిల్లాలు ఈ భారీ వర్షాల వల్ల అతలాకుతలమౌతోన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూర్, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునెల్వేలి.. జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యలో ఆయా జిల్లాలల్లో పాఠశాలలకు సెలవును ప్రకటించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
ఇప్పుడు తాజాగా దీని ఉధృతి ఉత్తరాంధ్రలో కనిపిస్తోంది. తీరానికి చేరువ అవుతున్న కొద్దీ వర్షాల తీవ్రత పెరుగుతోంది. ఈ తెల్లవారు జాము నుంచీ విశాఖపట్నంలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. అక్కాయపాలెం, అగనంపూడి, హనుమంతవాక, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం, ఆర్ కే బీచ్, బోయపాలెం, కాపులుప్పాడ, మద్దిలపాలెం, సీతమ్మధార.. వంటి ప్రాంతాల్లో వర్షం పడింది.
#WATCH | Andhra Pradesh: Rough sea witnessed in coastal areas in Vishakhapatnam due to the impact of cyclone Fengal. pic.twitter.com/u1Xhbxic6t
— ANI (@ANI) November 30, 2024
సముద్రం పోటెత్తుతోంది. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. చలి తీవ్రత అమాంతంగా పెరిగింది. తెల్లవారుజామున జాగింగ్‌కు వెళ్లినవాళ్లు ఇబ్బందులకు గురయ్యారు.












Click it and Unblock the Notifications