రీల్స్ తో రచ్చ చేస్తున్న దువ్వాడ వారి మాధురి
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీ ఓ కొలిక్కి రాలేదు. దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంట్లోకి వాణిని రానిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇక వ్యవహారం ఇంత దాకా వచ్చాక మాధురికి వాణి మార్గం సుగమం చేసింది అన్నట్టు ప్రస్తుత పరిస్థితి మారింది.
తెగని మొగుడు పెళ్ళాల పంచాయితీ .. సంతోషంలో మాధురి
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ మొదటి భార్యాభర్తల పంచాయతీ అనుకున్నారు అయితే ఆ తర్వాత మాధురి ఎంట్రీ ఇవ్వడంతో మొదలైన కుటుంబ కథా చిత్రం రోజు రోజుకో కొత్త ఎపిసోడ్ తో ఆసక్తికరంగా సాగుతోంది.దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు ఇంట్లో, ఒకరు ఇంటి బయట ఒకరు సమరానికి సై అంటుంటే.. దివ్వల మాధురి మాత్రం తెగ సంతోషంలో ఉన్నారు.

దువ్వాడ వారి పుణ్యమాని పెరిగిన మాధురి ఫాలోవర్స్
ఇన్నాళ్లు గుట్టుమట్టుగా సాగిన వ్యవహారం మీడియా సాక్షిగా బయటకు రావడంతో మాధురి తన ఇమేజ్ పెరిగిందని, తన ఫాలోవర్స్ పెరిగారని సంబరపడుతున్నారు. ఫైనల్ గా తాను దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటానని తేల్చి చెప్పి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేశారు. దువ్వాడ శ్రీనివాస్ అంటే తనకు ఇష్టమని, తనకు పిచ్చి అని, తనతో కలిసి ఉన్నానని, తనతో కలిసే ఉంటానని తేల్చి చెప్పారు.
వాణిని రెండు కొట్లిచ్చి ఇంట్లో ఉండమన్న మాధురి
ఇక తాజాగా ఇంటి విషయంలో వాణీ చేస్తున్న రచ్చకు కౌంటర్ ఇచ్చిన మాధురి తాను ఆ ఇంటి నిర్మాణానికి రెండు కోట్లు ఇచ్చానని తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చి ఆ ఇంట్లో వాణి ఉండొచ్చని పేర్కొన్నారు. లేదు కాదు కూడదు అంటే తనకు ఆ ఇంటి మీద హక్కు ఉంది కాబట్టి తాను కూడా అక్కడకు వచ్చి ఉంటానని స్పష్టం చేశారు.
ఇన్ స్టాలో పోస్టులతో మాధురి రచ్చ మాములుగా లేదుగా
ఇక తనకు డాక్టర్ రెస్టు తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పిన దివ్వల మాధురి సోషల్ మీడియాలో తనకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తెగ సంబర పడుతున్నారు. ఇన్స్టా వేదికగా రోజుకో వీడియో పోస్ట్ చేసి రచ్చ చేస్తున్నారు. ఇష్టం అనుకున్న వ్యసనంలా మారిపోయావు అంటూ ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు.
దువ్వాడ వారికి ప్రేమ లేఖ.. రీల్
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నువ్వచట కుశలమా నేనిచట కుశలమే అంటూ రీల్స్ చేసి పెడుతున్నారు. కారులో ప్రయాణం చేస్తూ, విండో గ్లాస్ దించి తల బయటపెట్టి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మాధురి రీల్స్ తో చేస్తున్న రచ్చ దువ్వాడ వారి కోసమేనని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications