సినీ అవకాశాల పేరుతో వ్యభిచారం: సినీనటుడి అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని ఫిలింనగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న సినీనటుడు, కో-ఆర్డినేటర్‌లను జారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణనగర్‌లో నివాసం ఉండే సినీనటుడు కె. వంశీ, సినీ కో-ఆర్డినేటర్ కృష్ణ కొంతకాలంగా ఈ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ కోస్తాంధ్రా నుంచి యువతుల్ని నగరానికి రప్పించి వ్యభిచార కూపంలోకి దింపగడం వీరి పని. వీరి చేతిలో ఇప్పటికే చాలా మంది యువతులు మోసపోయారు. వీరిపై బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం పోలీసులు రంగంలోకి దిగారు.

ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకులు వంశీ, కృష్ణల్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ సెక్స్ వర్కర్‌ను రెస్క్యూ హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నాన్న సమాచారంతో అల్వాల్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుడి తోపాటు ఓ విటుడు, సెక్స్ వర్కర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్‌లోని ఎంఆర్‌సిబి అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌ను కోల్‌కతాకు చెందిన జి. రాముష్రోష్(53) అద్దెకు తీసుకున్నాడు.
ఇందులో నేహా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలిచ్చాడు. కాగా, ఆ ప్లాట్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో అల్వాల్ ఎస్ఐ రాంబాబు దాడి చేసి నిర్వాహకుడు రాము, విటుడు మూర్తి, ఓ సెక్స్ వర్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications