పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మహిళా న్యాయవాదులు మండిపడుతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో వర్మ చేసిన వ్యాఖ్యలపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు వారు ఫిర్యాదు చేయడంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తనను కించపరుస్తూ, తన మనోభావాలను గాయపరిచారని, అందుకే వారిపై కేసు పెట్టబోతున్నాని ప్రకటించారు. తాను యూనివర్సిటీలో మాట్లాడిన దాంట్లో అధ్యాపకులకు, విద్యార్థులకు, ప్రొఫెసర్లకు కనపడని తప్పు ఊరు, పని, పాట లేనివాళ్లకు కనపడిందని, పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. వాళ్లు ఫొటోలో ఎలా నవ్వుతూ ఉన్నారో చూడండి అని చెప్పారు.

ఈనెల 15వతేదీన గుంటూరుకు సమీపంలోని ఆచార్య నాగార్జున వర్శిటీలో దర్శకుడు వర్మ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. వర్శిటీ 'అకడమిక్‌ ఎగ్జిబిషన్‌ 2023'కు ఆయన ముఖ్య అతిథిగా వెళ్లారు. నచ్చింది తినాలని, కావల్సినంత తాగాలని, ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని విద్యార్థులకు చెప్పారు. తాను ఎప్పుడూ తనకోసమే బతుకుతానని, తాను చనిపోయాక ఈ ప్రపంచం ఏమైనా తనకు అవసరంలేదన్నారు. ఈ తరహాలోనే మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

film director ramgopal varma comment on lady advocates

ఈ వ్యాఖ్యలపై మహిళా న్యాయవాదులు మండిపడ్డారు. వర్మపై పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులుండే వేదికపైకి వర్మను పిలిపించి అసభ్యకరంగా మాట్లాడించినందుకు వీసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలవల్ల మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతని వ్యవహారశైలి అసహ్యంగా ఉందని, అతను మాట్లాడిన తర్వాత అక్కడే ఉన్న ప్రొఫెసర్లు, అధ్యాపకులు అందరూ తలదించుకున్నారని, అటువంటి స్పీచ్ ను వీసీ చప్పట్లు కొడుతూ స్వాగతించడం అత్యంత దారుణమని ఘాటుగా విమర్శించారు.

వర్మతోపాటు వీసీపై చర్యలు తీసుకునేవరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేయడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. మరోవైపు దర్శకుడు వర్మ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ తదితర సంఘాలు ఉద్యమాలు చేశాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుణ్ని యూనివర్సిటీకి ఆహ్వానించి ప్రజలకు, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటూ ధ్వజమెత్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+