AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్..
ఏపీలో ఆస్తిపన్ను ( AP property tax) చెల్లింపుదారులకు ప్రభుత్వం ఈసారి ఇచ్చిన ఆఫర్ గడువు మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వారికి ఊరట కల్పిస్తూ ఇప్పటికే పురపాలక శాఖ ఈ ఆఫర్ ను ఇచ్చింది. దీంతో ఇప్పటికే చాలా మంది ఈ ఆఫర్ ను వినియోగించుకుని చెల్లింపులు కూడా చేసారు. అయితే మిగిలిన వారు కూడా ఆస్తిపన్ను చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు, వాటిపై వడ్డీలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వం ఎప్పటిలాగై ఈ ఏడాది కూడా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించిన వారికి అప్పటికే విధించిన వడ్డీపై రాయితీ ఆఫర్ చేస్తోంది. మొత్తం విధించిన వడ్డీపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. తద్వారా మొండి బకాయిల్ని వసూలు చేసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. దీని ప్రకారం ఇప్పటికే పలువురు ఆస్తిపన్ను బకాయిదారులు చెల్లింపులు చేస్తున్నారు.

ఈ నెల 31 లోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీ ఇవ్వడంతో ఆ గడువు మరో ఐదు రోజుల్లో ముగిసిపోనుంది. అలాగే ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం సర్కార్ మరో ఊరట ఇచ్చింది.ఇప్పటికే ఆస్తిపన్ను బకాయిల్ని వడ్డీతో చెల్లించిన వారికి తర్వాతి బిల్లులో మినహాయింపు ఇచ్చేలా జీవో 58లో మరో ఆఫర్ ఇచ్చింది. కాబట్టి ఆస్తిపన్నుపై వడ్డీ విధించిన ప్రతీ ఒక్కరికీ ఏదో విధంగా ఊరట కల్పించబోతున్నారు. దీంతో ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారు, అలాగే ఇంకా చెల్లించాల్సిన వారికీ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications