తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం; కోట్ల ఆస్తినష్టం!!

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయానికి దగ్గరగా ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి.

ఆలయానికి వెళ్ళే సన్నిధి వీధిలో ఇరువైపులా దుకాణాలు ఉన్నాయి. అయితే మొదట భవనంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ దుకాణంలో ఫోటో ల్యామినేషన్ మరియు దేవుళ్ళ పటాలన్నీ తయారు చేస్తుంటారు. ఈ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక దుకాణదారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా మంటలు ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire accident in the street near Tirupati Govindarajula Swamy Temple; Crores of property damage!!

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో భారీగా మంటలు ఎగసిపడి పక్కన ఉన్న దుకాణాల్లో కూడా ఈ మంటలు వ్యాపించాయి. ఒకపక్క విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడం, మరోపక్క అగ్ని ప్రమాదం వల్ల వస్తున్న మంటలకు ఫైర్ సిబ్బందికి కూడా మంటలు ఆర్పడం కష్టంగా మారింది.

అయినప్పటికీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గోవిందరాజస్వామివారి మాడవీధుల్లోకి రాకపోకలను నిలిపివేశారు. అగ్ని ప్రమాదం జరిగిన చోట గోవిందరాజ స్వామి వారి రథం ఉంది.

నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అధికంగా జరగడంతో మంటలు ఇళ్ళ వైపు కూడా వ్యాపిస్తున్న క్రమంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు భవనం ముందు ఉన్న ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో ఫోటో ఫ్రేమ్ వర్క్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అయితే భవనంలో ఇంకా ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+