విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు యత్నం: నిందితుల అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నకిలీ పత్రాలను సృష్టించి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శాంతిభద్రతల డిసిపి త్రివిక్రమవర్మ వివరాలు వెల్లడించారు.

భీమునిపట్నం మండలం కాపులుప్పాడ పంచాయతీ, సోమానపాలెం గ్రామంలో 268/3, 269/10, 269/11, 268/4, 269/5, 269/12, 269/14 సర్వే నెంబర్లు కలిగిన (10.76ఎకరాల)స్థలాన్ని మరుపిల్లి అప్పల నరసయ్య 1993 నుంచి 1998 సంవత్సరాల్లో వీరవెంకట సత్యనారాయణ, బొప్పన్న వీరవెంకట నాగేశ్వరరావులకు విక్రయించినట్లు జిపిఏ(జనరల్ పవర్ ఆఫ్ పట్టా)ను రాసుకున్నారు.

స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు సుమారు 170 ప్లాట్లను ఏర్పాటు చేసి ఓ లేఅవుట్ ఏర్పాటు చేసుకుని పంచాయతీ గుర్తింపుతో వాటిని విక్రయించారు. అందులో కొంతమంది వుడా గుర్తింపు కోసం అర్జీ పెట్టుకున్నారు. పలువురికి వుడా గుర్తింపు కూడా వచ్చింది. అనంతరం పలువురు యజమానులు స్థలాలను విక్రయించగా, మరికొంతమంది సరిహద్దు గోడలను పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో 2013లో ఈ స్థలాన్ని తన తండ్రి అప్పల నర్సయ్య తమ పేరు మీద జిపిఏ రాశారని సోమానపాలెం గ్రామానికి చెందిన మరుపిల్లి రామారావు(33), మరుపిల్లి రాజేంద్ర ప్రసాద్(33) పలువురిని నమ్మించి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

నకిలీ పత్రాలను సృష్టించి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

ఈ మేరకు మంగళవారం సాయంత్రం సిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శాంతిభద్రతల డిసిపి త్రివిక్రమవర్మ వివరాలు వెల్లడించారు.

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

భీమునిపట్నం మండలం కాపులుప్పాడ పంచాయతీ, సోమానపాలెం గ్రామంలో 268/3, 269/10, 269/11, 268/4, 269/5, 269/12, 269/14 సర్వే నెంబర్లు కలిగిన స్థలాన్ని మరుపిల్లి అప్పల నరసయ్య 1993 నుంచి 1998 సంవత్సరాల్లో వీరవెంకట సత్యనారాయణ, బొప్పన్న వీరవెంకట నాగేశ్వరరావులకు విక్రయించినట్లు జిపిఏ(జనరల్ పవర్ ఆఫ్ పట్టా)ను రాసుకున్నారు.

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు సుమారు 170 ప్లాట్లను ఏర్పాటు చేసి ఓ లేఅవుట్ ఏర్పాటు చేసుకుని పంచాయతీ గుర్తింపుతో వాటిని విక్రయించారు. అందులో కొంతమంది వుడా గుర్తింపు కోసం అర్జీ పెట్టుకున్నారు.

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

భూ కబ్జా-నిందితుల అరెస్ట్

పలువురికి వుడా గుర్తింపు కూడా వచ్చింది. అనంతరం పలువురు యజమానులు స్థలాలను విక్రయించగా, మరికొంతమంది సరిహద్దు గోడలను పెట్టుకున్నారు.

ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఏడాది ఆగస్టులో మరోసారి నిందితులు ఆ స్థలంపై తమకే పూర్తి అధికారం ఉందని ఎదుటవారిని బెదిరించి ట్రాక్టర్‌తో చదును చేసి సరిహద్దు గోడలను పగులగొట్టి బోర్డులను పెట్టారు. దీంతో పలువురు బాధితులు నగర పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జిపిఏ పట్టాలను పరిశీలించగా అవి నకిలీ పత్రాలని తేలింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిసిపి వివరించారు. ఈ సమావేశంలో ఏసిపి రవిబాబు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

English summary
The city police arrested two persons on the charge of trespassing onto a land under Bheemunipatnam Police Station limits here on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X