ఐదేళ్ళక్రితం సరిగ్గా ఇదేరోజు.. జగన్ అనే నేను.. మళ్ళీ జూన్ 9న హిస్టరీ రిపీట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఏ పార్టీకి పట్టం కడతాయి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజలలోను ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశం. ఈసారి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో ఎవరు అధికారంలోకి వచ్చినా అది చెప్పుకోవలసిన చారిత్రాత్మక విజయమే అవుతుంది. అయితే అలా చరిత్ర సృష్టించడం జగన్ కు మాత్రమే సాధ్యమవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.
ఐదేళ్ళ క్రితం సరిగ్గా ఇదేరోజు జగన్ సీఎంగా ప్రమాణం
సరిగ్గా ఇదే రోజు 2019లో మే 30వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం దద్దరిల్లిపోయేలా మధ్యాహ్నం 12.23 నిమిషాలకు జగన్ అనే నేను అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని మొదలుపెట్టగానే గ్రౌండ్ మొత్తం హర్ష ద్వానాలతో దద్దరిల్లిపోయింది.

మళ్ళీ ఎన్నికల్లో జగన్ దే విజయం: బలంగా నమ్ముతున్న వైసీపీ
2019లో 151 శాసనసభ స్థానాలను, 22 లోక్సభ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలాగా ఐదేళ్లు పరిపాలన కొనసాగిందని, మళ్లీ ఏపీలో సీఎంగా జగన్ అధికారాన్ని చేపట్టబోతున్నారని వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ సంక్షేమ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం అండగా నిలబడ్డారని వైసిపి నేతలు నమ్ముతున్నారు.
ఏపీలో మళ్ళీ సీఎం గా జగన్?
గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయం నమోదు చేస్తుందని ధీమాతో ఉన్నారు వైసిపి నేతలు. ఈ ఎన్నికలలో విజయం సాధించి ఈసారి విశాఖ నుండి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో, వైసిపి శ్రేణులు అదే ధీమాతో ఉన్నారు. హిస్టరీ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు.
ఐదేళ్ళ క్రితం జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుందని నమ్మకం
మే 30వ తేదీ 2019న జరిగిన చారిత్రాత్మక ఘట్టం మళ్లీ మరోమారు ఏపీలో రిపీట్ అవుతుందని బోలెడు విశ్వాసంతో ఉన్నారు. జూన్ 9వ తేదీన మళ్లీ రాష్టం మొత్తం వినిపించేలా, దేశం దృష్టి ఏపీపై నిలిచేలా జగన్ అను నేను అంటూ ఆయన ప్రమాణస్వీకారం జరుగుతుందని భావిస్తున్నారు. మరి వైసిపి పెట్టుకున్న ఈ గట్టి నమ్మకం నిజమవుతుందా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications