ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’.. భారీ డిస్కౌంట్లతో పండుగే పండుగ!!
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను త్వరలో ప్రారంభించినట్టు వెల్లడించింది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ప్రతి సంవత్సరం పండుగల సమయంలో నిర్వహించే ఫెస్టివల్ సేల్ కు రెడీ అయింది. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రకటించగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే 26వ తేదీన సేల్ అందుబాటులో ఉండనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇక ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ సేల్ లో భాగంగా బోలెడు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపైన భారీ డిస్కౌంట్ లను అందించనుంది. తాజాగా కొన్ని మొబైల్స్ పైన అందిస్తున్న డీల్స్ ను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

సూపర్ డీల్స్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్
ఇక ఈ డీల్స్ లో గూగుల్ పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 స్మార్ట్ ఫోన్ల పైన భారీ రాయితీ ఇస్తున్నట్టుగా ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అంతేకాదు ఫ్లిప్కార్ట్ సేల్ లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉన్నవారికి డిస్కౌంట్ అందించనుంది. హెచ్డిఎఫ్సి కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలు పైన 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్.
యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ , డెబిట్ కార్డులపైనా ఆఫర్లు
అంతేకాదు యూపీఐ చెల్లింపులలో 50 రూపాయల వరకు తగ్గింపు కూడా అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇక మరోవైపు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు పైన నో కాస్ట్ ఇఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. అంతే కాదు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష రూపాయలు వరకు రుణ సదుపాయాన్ని కూడా పొందచ్చని పేర్కొంది.
గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ పైన భారీ డిస్కౌంట్
బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తుంది ఫ్లిప్‌కార్ట్. ఎంఆర్పి 75,999 రూపాయలు ఉన్న గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ పైన 8జీబీ ర్యామ్ 128జిబి మొబైల్ ఫోన్ ను 40 వేల కంటే తక్కువకే ఇస్తున్నట్టు పేర్కొంది. ఇక శాంసంగ్ గెలాక్సీ s23 ఎఫ్ఈ మొబైల్ ఫోను 30000 కంటే తక్కువకే లభించనుంది.
బిగ్ బిలియన్ డేస్ సేల్ కు రెడీ అవ్వండి
ఇవి మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్స్ పైన పోటీ ఈ కామర్స్ దిగ్గజాలకు దీటుగా ఆఫర్లను ప్రకటించింది. ఇక గృహోపకరణాలపైనా, బట్టలు, వివిధ యాక్ససరీస్ పైన కూడా ఎవరూ ఊహించని విధంగా డిస్కౌంట్స్ ను ప్రకటించింది. మరెందుకాలస్యం త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ కు రెడీ అవ్వండి.












Click it and Unblock the Notifications