టీటీడీ ఛైర్మన్‌గా మాజీ సీజేఐ ఎన్వీ రమణ?

Former CJI NV Ramana: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,421 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 5.26 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

తిరుమలలో రద్దీ..

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు. శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Former CJI NV Ramana likely to appoint as a TTD Chairman

చాలాకాలంగా..

టీటీడీ ఛైర్మన్ పదవి కొంతకాలంగా ఖాళీగా ఉంటూ వస్తోంది. గతంలో ఛైర్మన్‌గా పని చేసిన మొన్నటి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

ఆచితూచి..

ఈ పోస్టును భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. అత్యంత కీలకమైన, ప్రతిష్ఠాత్మక పదవి కావడం వల్ల ఛైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఒకరని కాదు..

ఈ క్రమంలో తొలుత జనసేన సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు నాగబాబు పేరు వినిపించింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉండటం, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్న నేపథ్యంలో నాగబాబుకే ఖాయం కావొచ్చంటూ వార్తలొచ్చాయి. దీన్ని ఆయన తోసిపుచ్చారు.

ఎన్వీ రమణ పేరు..

ఆ తరువాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేరు తెర మీదికి వచ్చింది. దాదాపుగా ఆయనకే టీటీడీ ఛైర్మన్ పదవి ఖరారైందనే ప్రచారం కొద్దిరోజుల కిందట విస్తృతంగా సాగింది. ఇప్పుడు తాజాగా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరు చక్కర్లు కొడుతోంది.

చంద్రబాబు ప్రాధాన్యత..

బీఆర్ నాయుడు, ఎన్వీ రమణ.. ప్రస్తుతం వీరిద్దరి పేర్లే షార్ట్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరిని చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఎంపిక చేస్తారని అంటున్నారు. చంద్రబాబు తన తొలి ప్రాధాన్యతను మాజీ సీజేఐ ఎన్వీ రమణకే ఇస్తోన్నారని, ఆయన నియామకం వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం.

పులివర్తి నాని భార్య..

చంద్రగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు పులివర్తి నాని భార్య సుధారెడ్డి.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా అపాయింట్ అవ్వొచ్చని చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పులివర్తి నాని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆయన ఓడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+