జగన్ వద్దే తేల్చుకున్న అనిల్ కుమార్ యాదవ్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ శాసన సభ్యడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా ఉంటోన్నారు. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే గుడ్‌బై చెప్పొచ్చనే ప్రచారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది. సొంత పార్టీలోనే తనకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరింత బలాన్నిచ్చాయి.
వైఎస్ఆర్సీపీలో కొనసాగడంపైనా క్లారిటీ ఇచ్చారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన గుండె చప్పుడుగా అభివర్ణించారు. తనను కోస్తే జగన్ కనిపిస్తాడని పేర్కొన్నారు. జగన్‌కు మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడినని, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ మారబోతోన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.

అదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్‌పై అసహనంగా ఉంటూ వస్తోన్న కొందరు నాయకులు జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనిల్ కుయార్ యాదవ్‌కు మళ్లీ టికెట్ ఇస్తే తాము ఆయనకు అనుకూలంగా పని చేయబోమంటూ వారు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య అనిల్ కుమార్ యాదవ్.. కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. గతంలో కూడా నెల్లూరు సిటీ రాజకీయాలపై వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ.. ఇన్ని రోజులూ అవి నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చాయి. రెండు రోజులుగా అవి మళ్లీ భగ్గుమనడంతో మరోసారి ఈ వ్యవహారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరింది.
జిల్లా రాజకీయాల్లో తాను ఎదుర్కొంటోన్న ఇబ్బందులన్నింటినీ ఆయన.. వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా పని చేస్తోన్న నాయకుల వివరాలను జగన్‌కు తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి- రూప్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసమ్మతి నేతలు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ కావడాన్ని కూడా తప్పుపట్టారని అంటున్నారు.
తన రాజకీయ భవిష్యత్‌పై తుది నిర్ణయాన్ని అనిల్ కుమార్ యాదవ్.. వైఎస్ జగన్‌కే వదలివేస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవలందించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారని అంటున్నారు. అనిల్‌తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్.. ఆయనకు భరోసా ఇచ్చారని తెలుస్తోంది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications