Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సర్కార్‌పై మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫైర్ .. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసిపి సర్కార్ పై మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రాలుగా వాగ్బాణాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తున్న మండిపడిన చినరాజప్ప ఆంధ్రప్రదేశ్లో టీడీపీని లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతోందని, టిడిపి పై అడుగడుగునా దాడులకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు.

గత ప్రభుత్వం రైతుల రుణ మాఫీ చేయాలని ఇచ్చిన జీవోను కావాలని రద్దు చేశారని, రుణమాఫీ చేయకుండా జీవోను రద్దు చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. గట్టిగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒకపక్క ఏపీ లోటు బడ్జెట్ లో ఇబ్బందులు పడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను ప్రభుత్వ కార్యాలయ భవనాలకు వేస్తూ, భవనాల రంగులు మార్చేందుకే రూ.1300 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

 Former minister Chinnarajappa Fire on Jagan government

ఇక కచ్చులూరు ప్రమాదంలో గోదావరిలో మునిగి పోయిన బోటును తీయలేదని, 16 మంది ఇంకా జల సమాధి లోనే ఉన్నారని.. కనీసం బోటును కూడా తీయలేని అసమర్థత ప్రభుత్వమని నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. మొన్నటి వరకు కొత్త ఇసుక పాలసీ అన్నారని, ఇప్పుడు ఇసుక సమస్య ఉండదని చెప్పారని కానీ ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చినరాజప్ప పేర్కొన్నారు. వైసిపి నేతలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు చింతమనేని పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జగన్ సర్కార్ పాలనలో అడుగడుగునా విఫలమవుతున్న అంటూ కచ్చులూరు బోటు ప్రమాద ఘటనను ఉదాహరణగా చెప్పి బోటును బయటకు తీయలేని అసమర్థ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+