Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ-జనసేన కూటమికి వచ్చే సీట్లు ఇవే ? మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం...!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్న సామెత అక్షరాలా నిజమవుతోంది. తాజాగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై అంచనాలు కూడా వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలిచేదెవరు ? ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై రాజకీయ ఉద్దండులు జోస్యాలు చెబుతున్నారు.

ఇదే క్రమంలో సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తాజా పరిణామాలను ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సాధించే ఫలితాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టీడీపీ-జనసేన కూటమికి వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని డీఎల్ కుండబద్దలు కొట్టేశారు. ఇరు పార్టీల పొత్తు ప్రకటన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా డీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

dl ravindra reddy

టీడీపీ-జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఓ ఊపు వచ్చిందని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. దీంతో వీరి కూటమి వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు సాధించడం ఖాయమని డీఎల్ తెలిపారు. చంద్రబాబు, పవన్ ది మనస్పర్ధలు లేని కూటమి అని కూడా డీఎల్ విశ్లేషించారు. జగన్ అనుచరుల అరాచకాలు ప్రజల్లో నాటుకుపోయాయని డీఎల్ తెలిపారు. రాష్ట్రం నాశనం కావడానికి జగన్ కారణమని కూడా మాజీ మంత్రి ఆరోపించారు.

అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయితీపరుడని మాజీ మంత్రి డీఎల్ వ్యాఖ్యానించారు. సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులోనూ చంద్రబాబు బెయిల్ కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేదన్నారు. అలాగే మరో స్కాంగా చెబుతున్న ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసులోనూ ఎలాంటి అవినీతి జరగలేదని డీఎల్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. తద్వారా చంద్రబాబు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని డీఎల్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+