AP Election: ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు ? గోనె ప్రకాష్ రావు జోస్యం- ఎన్ని సీట్లంటే..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలుంది. రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ ఎన్డీయే కూటమి పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ తరుణంలో పలు సర్వేలు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో తేల్చిచెప్పేశాయి. అయితే వీటిలో కొన్ని వైసీపీకి, మరికొన్ని కూటమికి పట్టం కట్టాయి. ఈ తరుణంలో ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు తన వ్యాఖ్యలతో సంచలనాలు రేపిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తాజాగా ఏపీ ఎన్నికలపై తన జోస్యం చెప్పేశారు.
ఏపీలో ఈసారి ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలువబోతోందని గోనె ప్రకాష్ రావు ఇవాళ వెల్లడించారు. ఎన్డీయే కూటమికి ఏకంగా 145 సీట్లు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో టీడీపీకి కొంత మేర నష్టం జరిగిందని, అయినా భారీ మెజార్టీతో కూటమి గెలువబోతోందని గోనె స్పష్టం చేసారు. మోడీ,షా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

మరోవైపు సీఎం జగన్ పై గోనె ప్రకాష్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైనాట్ 175 అన్న జగన్.. చాలా చోట్ల అభ్యర్ధులను ఎందుకు వేరే స్ధానాలకు మార్చారని ప్రశ్నించారు. చెల్లి షర్మిలని వదిలేశారని, బాబాయ్ ను చంపేశారని విమర్శించారు. సొంత చెల్లెల్ని వదిలేసిన జగన్.. ఇతరుల్ని చెల్లెల్లని చెప్పుకుంటున్నారని గోనె ప్రకాష్ రావు ఎద్దేవా చేసారు. ఒకప్పుడు వైఎస్ మరణం తర్వాత తన ఫ్యామిలీని టార్గెట్ చేసిన బొత్సను జగన్ తండ్రి సమానుడని చెప్పుకోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications