ఒక్క ట్వీట్ తో బాంబ్ పేల్చిన వర్మ.. అంత చిన్నచూపా.. భరిస్తున్నాం అంటూ ఎమోషనల్
గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 స్థానాల్లో.. 164 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక పిఠాపురంలో పవన్ కల్యాణ్ రికార్డు విజయం సాధించారు. ఏకంగా 51 వేల మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కల్యాణ్.
అయితే ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని మాటిచ్చారు. అన్న మాటకు కట్టుబడి తాజాగా పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ వెంట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ కోసమే వర్మ.. తన పిఠాపురం సీటును త్యాగం చేసిన విషయం తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదన్న విషయం తెలిసిందే.

ఇక పిఠాపురం పర్యటనలో పవన్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు వర్మ. అయితే ఈ కార్యక్రమంలో వర్మకు అవమానం జరిగిందని.. అతడిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళలకు కుట్టు మెషీన్లు, రైతులకు వ్యవసాయ సామాగ్రి పంపిణీ చేశారు. అయితే టీడీపీ నేత వర్మ అక్కడకు వస్తున్న క్రమంలో పోలీసులు వీఐపీలకు అనుమతి లేదంటూ ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వర్మ మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే ఇదే వర్మ.. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందించారు. 'రాష్ట్రంలో ఇంకా YSRCP అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి.. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా.. అయినా క్రమశిక్షణతో భరిస్తున్నాం' అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీసులపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోపై నెట్టింట ట్రోల్స్ నడుస్తున్నాయి. పవన్ కల్యాణ్ కావాలనే వర్మను ఆపారని కామెంట్స్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇంకా వైసిపి అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి
— SVSN Varma (@SVSN_Varma) April 25, 2025
తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా
అయినా క్రమశిక్షణతో భరి స్తున్నాం
నువ్వు ఎమ్మెల్యే కాదు, వార్డ్ మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, వచ్చే ఎలక్షన్స్ లో పవన్ కల్యాణ్ కు ఎలా క్యాంపెయిన్ చేయాలో ప్లాన్ చేసుకో అని ఒకతను కామెంట్ చేశాడు. ఇంత అవమానిస్తున్నా ఎలా బ్రో అని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు. మీ పార్టీలో మీకే గౌరవం లేదు ఖర్మ అంటూ మరో వ్యక్తి అన్నాడు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications