రాజధానిలో కీలకం: జగన్ పార్టీలోకి మాజీ కేంద్రమంత్రి, మాజీ స్పీకర్?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పనబాక లక్ష్మి, ఆమె భర్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో వైసిపి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. టిడిపిలోని కొందరు అసంతృప్తులు వైసిపి వైపు చూస్తున్నారు.

ys jagan

రానున్న ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కూడా టిడిపి, వైసిపి, బీజేపీల వైపు చూస్తున్నారు.

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వైసిపిలో చేరుతారనే ప్రచారం కొంతకాలం పాటు సాగింది. ఆయన తెనాలి నియోజకవర్గానికి చెందిన వారు. నాదెండ్ల మనోహర్ రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడం వైసిపికి కలిసి వచ్చే అంశం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Union Minister and Former Speaker may join YSRCP
Please Wait while comments are loading...