ద్వారంపూడికి బిగుస్తున్న ఉచ్చు.. హింట్ ఇచ్చిన మంత్రి!!

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ కానూరులోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని ద్వారంపూడి కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

కాకినాడలో ద్వారంపూడి మాఫియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ బియ్యం మాఫియాను ద్వారంపూడి కుటుంబం పెంచి పోషించిందని ఆరోపించారు. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల అంశం పైన పూర్తిస్థాయిలో దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ద్వారంపూడి మాఫియా భయంకరంగా విస్తరించి ఉందని ఆయన వెల్లడించారు. తనిఖీల సందర్భంగా ఒక్క కాకినాడ పోర్ట్ లోనే 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Former YCP MLA Dwarampudi chandrasekhar reddy family in rice mafia minister nadendla manohar

159 కోట్ల రూపాయల విలువైన బియ్యం సీజ్
వారం రోజుల్లోనే 159 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని సీజ్ చేసామని పేర్కొన్నారు. పేదల పొట్ట కొట్టి కోట్లు దండుకున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

దోపిడీపై సిఐడీ విచారణ చేయిస్తాం
దోపిడీపై సిఐడీ విచారణ జరిపిస్తామని కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.రేషన్ మాఫియా పై ఉక్కు పాదం మోపుతామని మంత్రి స్పష్టం చేశారు. మొన్నటికి మొన్న కాకినాడ జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ యాంకరేజ్ పోర్టు గోదాములను పరిశీలించారు.

ద్వారంపూడికి చుక్కలు చూపించడం పక్కా అంటున్న మంత్రి
ఆ సమయంలో కూడా ఆయన రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించామని దీని వెనుక ద్వారంపూడి ఫ్యామిలీ ఉందని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం పేదల పొట్ట కొడుతుందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారంపూడికి చుక్కలు చూపించడం పక్కా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+