అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం -అంబటి సంచలన ట్వీట్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తన తాజా చిత్రం పుష్ప 2 విడుదల సందర్బంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారన్న ఆరోపణలపై చిక్కడపల్లి పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఆయన కోసం తెలంగాణ హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసారు.
ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా అయిన అంబటి రాంబాబు ఈ అరెస్టును ఖండిస్తూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అంటూ అంబటి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవోను సైతం ట్యాగ్ చేసారు. తద్వారా అల్లు అర్జున్ అరెస్టుపై వీరంతా స్పందించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.

ALLU ARJUN అరెస్టు అన్యాయం !@alluarjun @PawanKalyan @revanth_anumula @ncbn @TelanganaDGP @TelanganaCMO
— Ambati Rambabu (@AmbatiRambabu) December 13, 2024
మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిపై అంబటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా అల్లు అర్జున్ అరెస్టును తప్పుబడుతూ ఇలా అంబటి ట్వీట్ పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కు వైసీపీ మద్దతునిస్తోందన్న చర్చ నేపథ్యంలో అంబటి ట్వీట్ చర్చనీయాంశమైంది. అటు అల్లు అర్జున్ కోసం జగన్ లాయర్లు రంగంలోకి దిగడం, అంబటి రాంబాబు ఈ అరెస్టును ఖండిస్తూ ట్వీట్ పెట్టడం ద్వారా వైసీపీ నిర్ణయాలపైనా చర్చ జరుగుతోంది. అంబటి రాంబాబు ఇప్పటికే అల్లు అర్జున్ కు మద్దతుగా ఎన్నికల సమయంలోనూ పలు వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications