ఫ్రీ పెట్రోల్.. ఎగబడుతున్న జనం

అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులను వణికిస్తున్నాయి. యుద్ధం వస్తే చమురు సరఫరా ఆగిపోతుందనే భయంతో జనం ఒక్కసారిగా పెట్రోల్ బంకులపై దండెత్తారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇంధన కొరత ఏర్పడి, అనేక బంకులు మూతపడ్డాయి. అయితే, ఇలాంటి కష్టకాలంలో తిరుపతిలోని ఒక బంకు యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్రమంతా పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతుంటే, తిరుపతిలోని తనపల్లి వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ఇంధన సంక్షోభం దృష్ట్యా వాహనదారులను ఆదుకునేందుకు బంకు యజమాని రాజేష్ రెడ్డి ప్రతి టూ వీలర్‌కు ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 'ఫ్రీ' అనే వార్త తెలియగానే బైకర్లు ఆ బంకు వైపు పరుగులు తీశారు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ప్రస్తుత సంక్షోభ సమయంలో సాటివారికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Free Petrol in Tirupati Amid AP Fuel Crisis Bunk Owner Offers 1 Litre Free as Iran-USA War Fears Grow

భయంతో పెరిగిన వినియోగం: 50 శాతం జంప్!

యుద్ధం భయం (Panic Buying), ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా రెట్లు పెరుగుతాయనే అపోహతో.. ఏపీలో పెట్రోల్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. సాధారణ రోజుల్లో కంటే అమ్మకాలు ఏకంగా 50 శాతం పైగా పెరగడం గమనార్హం. సాధారణంగా రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది ఏకంగా 10,345 కిలో లీటర్లకు చేరింది. డీజిల్ విక్రయాలు కూడా 9,048 నుండి 14,156 కిలో లీటర్లకు పెరిగాయి. జనం పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.

10 శాతం బంకులు 'క్లోజ్'.. విక్రయాలపై ఆంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,510 పెట్రోల్ బంకుల్లో దాదాపు 421 బంకులు (సుమారు 10 శాతం) స్టాక్ లేక 'నో స్టాక్' బోర్డులు పెట్టేశాయి. స్టాక్ ఉన్న చోట కూడా యజమానులు ఆంక్షలు విధిస్తున్నారు. లారీలకు రూ.5 వేలు, ట్రాక్టర్లకు రూ.1,500, స్కూటర్లకు కేవలం రూ.200 చొప్పున మాత్రమే ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు తమ రోజువారీ పనులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగి పెట్రోల్ కంపెనీలతో సమీక్షిస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, పెట్రోల్, డీజిల్ దొరకదనే భయం మాత్రం జనాన్ని వెంటాడుతూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+