ఇంట్లో పేలిన ఫ్రిజ్.. ఆ చిన్న తప్పుతో భారీ బ్లాస్ట్..!

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలడం కలకలం రేపుతోంది. మొగల్తూరు మండలం కొండవారిపాలెంలోని ఓ ఇంట్లో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఎల్ జీ కంపెనీ ఫ్రిజ్ పేలిపోయింది. బ్లాస్టింగ్ ధాటికి ఇంట్లోని పలు వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇల్లు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో ఆ ఇంట్లోని వాళ్లు భయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని తెలుస్తోంది. మరో ఘటనలో నర్సాపూర్ రూరల్ మండలంలోని గొల్లపల్లిలో ఫ్రిజ్ పేలి రేకుల ఇల్లు పూర్తిగా దగ్దమైంది. గ్రామానికి చెందిన సారా సంతోష ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలిపోయింది. దీంతో ఇంట్లోని బీరువాలో ఉన్న నగదు, బంగారం, బట్టలు, అలాగే నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. సంతోష భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. కూలీ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తోంది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితురాలు కోరింది.

FridgeExplodes in Kondavaripalem House Mogalthur Mandal West Godavari Shocking Blast Reported

ఇక గతంలోనూ ఫ్రిజ్ పేలిన ఘటనలు సంభవించాయి. అయితే ఫ్రిజ్ పేలడానికి ప్రధాన కారణాలు కంప్రెసర్ ఫెయిల్యూర్, శీతలీకరణ గ్యాస్ లీకేజీ సమస్యలతో పాటు ఎలక్ట్రిక్ సమస్యలైన షార్ట్ సర్క్యూట్, ఇన్‌ స్టాలేషన్ సరిగా చేయకపోవడం లేదా వెంటిలేషన్ లేకపోవడం,ఓవర్ లోడింగ్ తదితర సమస్యలుగా నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ ను గోడకు దగ్గరగా కాకుండా సుమారు 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. అందువల్ల కంప్రెసర్ కు సరైన గాలి తగులుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫ్రిజ్‌ డోర్‌ ను ఎక్కువసేపు తెరిచి ఉంచడం.. పదే పదే తెరవడం, మూయడం చేయొద్దని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+