Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూఎస్ వెళ్ళిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. షాకయ్యే కారణం చెప్పిన టీడీపీ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై వాడి వేడి చర్చ జరుగుతుంది. ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరంగా మారింది. వైసిపి 151 స్థానాలు గెలిచి మళ్లీ అధికారం చేపడుతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే, ఈసారి కూటమిదే విజయమని టిడిపి, జనసేన, బిజెపిలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.

గన్నవరం నియోజకవర్గంపై ప్రజల్లో ఆసక్తి
ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వంటి వారు కూడా ఈ ఎన్నికలలో గెలిచేది టిడిపి కూటమి అనే పదే పదే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్న విషయం పక్కన పెడితే ఏపీలో కొన్ని నియోజకవర్గాలలో మాత్రం ఎవరు గెలుస్తారు అన్నదాని పైన ఏపీ ప్రజలలో ప్రధానంగా ఆసక్తి ఉంది. ఇక అటువంటి నియోజకవర్గాలలో గన్నవరం నియోజకవర్గం ఒకటి .

Gannavaram MLA Vallabhaneni Vamsi went to USA TDP says the shocking reason

గన్నవరంలో వంశీ ఓటమి ఖాయం
గన్నవరం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలలో వల్లభనేని వంశీ గెలుస్తారా లేక తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి హోరాహోరీగా పోరాటం చేసిన యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తారా అన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారిన అంశం. అయితే ఈసారి ఎన్నికలలో వల్లభనేని వంశీ ఓటమి ఖాయమని తెలుగు తమ్ముళ్లు పదే పదే చెబుతున్నారు.

యూఎస్ వెళ్ళిన వల్లభనేని వంశీ
ఈసారి ఏపీలో అధికారంలోకి వచ్చేది టిడిపినే కాబట్టి వంశీ కూడా టిడిపి పెద్దలతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్న వారు కూడా లేకపోలేదు. ఇక ఇదే సమయంలో తాజాగా వల్లభనేని వంశీ అమెరికాలోని డల్లాస్ కు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 17వ తేదీన వల్లభనేని వంశీ యూఎస్ వెళ్లారు. వల్లభనేని వంశీ కొడుకు అక్కడే చదువుకుంటున్న క్రమంలో వంశీ యూఎస్ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

వంశీ యూఎస్ పర్యటన వాడేస్తున్న టీడీపీ
ఇక వంశీ డల్లాస్ కి వెళ్లడాన్ని కూడా తెలుగు తమ్ముళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు వాడేసుకుంటున్నారు . ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న ఆలోచనలో ఉన్న వంశీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు రెడీ అయ్యి యుఎస్ వెళ్లారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇక మరికొందరు టిడిపినేతలు అయితే అమెరికాలో ఉన్న ఎన్నారైల ద్వారా టిడిపి పెద్దలతో మళ్ళీ రాజీ కోసం వంశీ ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే అమెరికా వెళ్లారని చెబుతున్నారు.

వంశీ ఏం చేసినా ఆసక్తే
అసలు వంశీ అమెరికా ఎందుకు వెళ్లారు అన్నది పక్కన పెడితే వంశీ ఏం చేసినా కూడా రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోను ఆసక్తికరంగా మారుతుంది. మరి ఈ క్రమంలో వంశీ గన్నవరంలో గెలుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+