చంద్రబాబు డబ్బులతో ఆస్తులు కొన్నాడు, నిజమేనా: గరుడఫేం శివాజీ హల్‌చల్
Recommended Video

ఏపిలో కొద్ది రోజుల క్రితం వరకూ ఆపరేషన్ గరుడ పేరుతో హడావుడి చేసిన నటుడు శివాజీ ఓ రిజిస్టార్ కార్యాలయం ముందు ప్రత్యక్ష మయ్యారు. అక్కడ ఆయన రాకను తెలుసుకొని కవరేజ్ కు వచ్చిన మీడియాను చూసి ఒక్కసారిగా చెల రేగి పోయారు. మీడియా మీద ఆగ్రహంతో అన్నారో..నిజమో చెప్పారో కానీ, ఇప్పుడు ఆయన చేసిన కామెంట్లు హల్‌చల్ అవుతున్నాయి.

ఆపరేషన్ గరుడ ఫేం శివాజీ
సినీ నటుడు..ఏపిలో ఆపరేషన్ గరుడ ఫేం శివాజీ మరోసారి వార్తల్లోకెక్కాడు. కొద్ది కాలం క్రితం కేంద్రం ఏపి పై కుట్ర చేస్తుందంటూ..దానికి ఆపరేష్ గరుడ పేరుతో హడావుడి చేసారు. ఆ తరువాత వైసిపి అధినేత జగన్ పై జరిగిన దాడి సమయంలో ముఖ్యమంత్రి మొదలు టిడిపి నేతలంతా ఇదే గరుడ గురించి ప్రస్తావించారు. శివాజీ ని విచారించాలని బిజెపి..వైసిపి డిమాండ్ చేసాయి. ఆ సమయంలో అమెరికా వెళ్లిన శివాజీ..ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరం రిజిస్టార్ కార్యాలయం వద్ద సడన్ గా దర్శన మిచ్చారు.

గన్నవరం
ఆయన గన్నవరం మండలం చిన అవుట్ పల్లి గ్రామంలో ఒక అపార్ట్ మెంట్‌లో రెండు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం గన్నవరం కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. అది కవర్ చేయటానికి వెళ్లిన మీడియా పై శివాజీ ఫైర్ అయ్యారు. ఆయన తో పాటుగా అనుచరులు సైతం హంగామా సృష్టించారు. ఆ సమయం లో శివాజీ చేసిన కామెంట్లు యాధృచ్చికమో..నిజమో తెలియదు కానీ...హల్‌చల్ చేస్తున్నాయి.

చంద్రబాబు డబ్బులతో ఫ్లాట్లు..రాసుకోండి..
తాను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ఫ్లాట్లు చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో కొనుక్కుంటున్నాడంటూ రాసుకోవాలని అక్కడికి వచ్చిన మీడియాకు శివాజీ సూచించారు. అయితే, మీడియా పై ఉన్న ఆగ్రహంతో అలా అన్నారా..లేక ఆవేశం లో నిజమే చెప్పారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. కొంత కాలంగా బిజెపి..వైసిపి నేతలు శివాజీ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నుండి శివాజీకి సాయం అందుతుందని ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో శివాజీ చేసిన కామెంట్లు పై చర్చ మొదలైంది.

శివాజీ ఆ కామెంట్స్ ఎందుకు చేసారో కానీ
తాను కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కు వచ్చి..అక్కడ ఉన్న మీడియా పై ఆగ్రహం ప్రదర్శించి..వారు తీసిన ఫోటోలు..వీడియాలు డిలేట్ చేయాల్సిన అవసరం శివాజీ అనుచరులకు ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. తన సొంత సొమ్ముతో కొనుక్కొనే ఫ్లాట్ల గురించి అంతగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శివాజీ ఆ కామెంట్స్ ఎందుకు చేసారో కానీ..అనవరసంగా వివాదం లో చిక్కుకున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications