బుక్ చేసుకున్నా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకుంటే.. ఈ నంబర్లకు ఫిర్యాదు చెయ్యండి!

పశ్చిమాసియాలో ఇరాన్‌ ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంపై కూడా యుద్ధ ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత డెలివరీ ఆలస్యమైతే వినియోగదారులు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయి.

సిలిండర్ డెలివరీలో జాప్యం.. హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు

ప్రస్తుతం దేశంలో చాలా కుటుంబాలు ఎల్పీజీ గ్యాస్‌పై ఆధారపడి వంట చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల సిలిండర్ డెలివరీ ఆలస్యమవుతోందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచాయి. గ్యాస్ విషయంలో వినియోగదారులు ఆందోళన చెందవద్దని పేర్కొంటున్నాయి.

Gas Cylinder Delivery Delay Oil Companies Ask Consumers to File Complaints Amid Supply Concerns

బుక్ చేశాక గ్యాస్ రాకుంటే ఫిర్యాదు చేయండి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లోపు డెలివరీ చేయాలి. ఒకవేళ ఆ సమయానికి సిలిండర్ అందకపోతే వినియోగదారులు సంబంధిత గ్యాస్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. బుకింగ్ నంబర్ లేదా కన్స్యూమర్ ఐడీ వివరాలతో ఫిర్యాదు చేస్తే అధికారులు సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకుంటారు.

ఫిర్యాదు చెయ్యాల్సిన హెల్ప్ లైన్ నంబర్ లు ఇవే

దేశంలో ప్రధానంగా మూడు కంపెనీలు వంటగ్యాస్ సరఫరా చేస్తున్నాయి. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సంస్థలు వినియోగదారుల కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచాయి. గ్యాస్ బుక్ చేసినా రాకపోతే ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800-22-4344 లేదా 7715012345 నంబర్లను సంప్రదించవచ్చు.

గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదు

అలాగే హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222 నంబర్లకు కాల్ చేసి తమ సమస్యను తెలియజేయవచ్చు. అదేవిధంగా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి కంపెనీలు తగిన చర్యలు తీసుకుంటాయని అధికారులు తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసమే హెల్ప్ లైన్ నెంబర్లు

ప్రపంచ యుద్ధ పరిస్థితుల ప్రభావం వల్ల కొన్నిసార్లు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులు హెల్ప్‌లైన్ సేవలను ఉపయోగించి సమస్యలను వెంటనే తెలియజేయాలని సదరు గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి. దీంతో గ్యాస్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, వినియోగదారులకు త్వరగా సేవలు అందించడం సాధ్యమవుతుందని వారు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+