'గౌతమీపుత్ర శాతకర్ణి': చంద్రబాబును బయటపడేసిన కేసీఆర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్.. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విషయంలో గట్టున పడేశారా? అంటే అవుననే అంటున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విషయంలో గట్టున పడేశారా? అంటే అవుననే అంటున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలోను వినోదపు పన్ను మినహాయించారు. మొదట తెలంగాణ ప్రభుత్వం.. ఆ తర్వాతే ఏపీ ప్రభుత్వం మినహాయించింది.

తొలుత చంద్రబాబు దీనికి మినహాయింపు ఇచ్చి ఉంటే
విమర్శలపాలయ్యేవారని అంటున్నారు. ఇప్పటికే వైసిపి, కాంగ్రెస్ పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ చిన్న అంశం దొరికినా వదలడం లేదు.

విమర్శలు వచ్చేవి
తెలంగాణ మినహాయింపు ఇవ్వకముందే లేదా ఇవ్వకుంటే.. ఏపీ మాత్రమే ఇస్తే.. బావమరిది సినిమాకు పన్ను మినహాయించారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చేవని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ మినహాయించిన అనంతరం చంద్రబాబు మినహాయించారు.

కేసీఆర్ తర్వాత
బాలకృష్ణ.. కేసీఆర్‌ను కలవడం, పన్ను మినహాయించడం అంతా ఓ రోజులో జరిగిపోయింది. చారిత్రక సినిమాలకు పన్ను మినహాయింపు తమ ప్రభుత్వం విధానంగా పెట్టుకుందని కేసీఆర్ అదే రోజు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు ఏపీలో మినహాయింపు జరిగింది.

గతంలో పోటాపోటీ
గతంలో, ఉద్యోగుల జీతాల నుంచి ఆర్టీసీ ఉద్యోగుల జీతాల వరకు ప్రతి విషయంలో చంద్రబాబు - కేసీఆర్‌లు పోటీ పడ్డారు. ఉద్యోగుల జీతాలు ఒకరిని చూసి మరొకరు, ఒకరికి మించి మరింత ఎక్కువ పెంచారనే వాదనలు ఉన్నాయి. పలు విషయాల్లో సీఎంలు పోటీ పడ్డారు.

తెలంగాణ తర్వాత ఏపీ
అయితే, ఓటుకు నోటు అనంతరం విభేదాలు వచ్చినా, ఆ తర్వాత ఇరువురు సీఎంలు కలిసిపోయారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాకు తొలుత కేసీఆర్, ఆ తర్వాత చంద్రబాబు పన్ను మినహాయించడం పైనా చర్చ సాగుతోంది. ఏదైనా మతలబు ఉందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైసిపి లేదా కాంగ్రెస్ పార్టీ విమర్శల నుంచి చంద్రబాబును కేసీఆర్ కాపాడారని అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications