కడప, అనంతపురం: నిన్నటివరకు ఒకలెక్క.. రేపటి నుంచి మరో లెక్క
ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఖనిజం నిల్వల్ని గుర్తించారు. అనంతపురం, కడప జిల్లాల్లో లిథియం నిల్వలు ఉన్నట్లు తేలింది. జమ్మూ కాశ్మీర్‌లో భారీ సంఖ్యలో లిథియం నిల్వలను కొద్దినెలల కిందట గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ అనంతపురం, కడప జిల్లాల సరిహద్దులో ఈ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నివేదిక ఇచ్చింది. ఈ రెండు జిల్లాల్లోని లింగాల, తాడిమర్రి, ఎల్లనూరు మండలాల్లో దాదాపు 5 చదరపు కిలోమీటర్ల (500 హెక్టార్ల) మేర నిల్వలు ఉంటాయని జీఎస్‌ఐ అంచనా వేస్తోంది.
పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్ (గతంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) చుట్టుపక్కల ఈ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు, ఇతర ప్రాంతాల్లో ప్రాథమిక సర్వేలో లిథియం నమూనాలను గుర్తించారు. జీఎస్‌ఐ తన నివేదికను కొద్ది నెలల క్రిందట కేంద్రప్రభుత్వానికి అందజేసింది. కచ్చితంగా ఎంతమేర లిథియం నిల్వలు ఉన్నాయనేది త్వరలోనే తేలనుంది. వీటిని అన్వేషించేందుకు అనుమతులివ్వాలంటూ రాష్ట్ర గనుల శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లిథియం అనేది పరమాణు ఖనిజం కావడంతో అణు ఇంధన సంస్థ (డీఏఈ) నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్రం సూచించింది.

రాష్ట్రంలో ఇటీవలే బంగారం గనుల్ని కూడా గుర్తించారు. నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాల గనులు ఉన్నాయని తేలింది. అక్కడ గనుల బ్లాకుల్ని కేటాయించాలని ఎన్‌ఎండీసీ కోరింది. సంస్థ ఈ విషయాన్ని తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలోని గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునే అవకాశం కల్పించాలని కోరింది. తాజాగా లిథియం నిల్వలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications