ఇది మామూలు నల్లతాచు కాదు బాబోయ్.. అంతకుమించి.. వీడియో చూసే దమ్ముందా..?
పాములంటే ఎవరికైనా భయమే.. అలాంటిది నల్లతాచు అంటే ఎగిరి గంతేసి వామ్మో అంటూ పరిగెత్తుతారు. సాధారణంగా పాములు వర్షాకాలం, శీతాకాలంలో వేడి కోసం ఇళ్లు, గడ్డి లోకి ప్రవేశిస్తుంటాయి. అయితే తాజాగా కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, మహిపాల చెరువు గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ భారీ నల్లతాచు బీభత్సం సృష్టించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, మహిపాల చెరువు గ్రామంలో ఇటీవల ఒక పెద్ద నల్లతాచు పాము కలకలం సృష్టించింది. సుమారు ఐదడుగుల పొడవైన, వయసు ఎక్కువగా ఉన్న (దాదాపు 70 సంవత్సరాలుగా అంచనా) నల్లతాచుపాము గ్రామంలోని బొక్కా చంద్రరావు ఇంటి వద్ద ఉన్న పొలంలోకి ప్రవేశించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
గడ్డి కుప్పలో ప్రవేశించిన పాము
సాయంత్రం వేళ పొలంలో వరి కోతకు వస్తున్న సమయంలో ఈ పాము కనిపించింది. గడ్డి కుప్పలోకి ప్రవేశించిన పామును చూసి పొలం పనులు చేస్తున్న వారు తీవ్ర ఆందోళన చెందారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వారు వెంటనే ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్ అయిన గణేష్ వర్మకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ మహిపాల చెరువుకు చేరుకున్నారు. ఆయన ఎలాంటి ప్రమాదం లేకుండా, చాకచక్యంగా ఆ పెద్ద నల్లతాచుపామును బంధించారు. అనంతరం, జన సంచారం లేని సుదూర ప్రాంతంలో ఆ పామును సురక్షితంగా విడిచిపెడతామని వర్మ తెలిపారు.
పాముల బెడదపై గణేష్ వర్మ హెచ్చరిక
ఇటీవల కాలంలో గ్రామాలలో పాముల బెడద ఎక్కువైందని ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాములు ఇళ్లలోకి, గడ్డి మెట్లలోకి రావడానికి గల కారణాలను ఆయన వివరించారు

శీతాకాలం: చలి పెరిగే కొద్దీ పాములు వెచ్చదనం కోసం గడ్డి మెట్లలోకి లేదా ఇళ్లలోనికి వస్తుంటాయి.
పర్యావరణ విధ్వంసం: లేఔట్లు, నిర్మాణాల పేరుతో చెట్లను నరికివేయడం, పాముల పుట్టలను త్రవ్వివేయడం వలన అవి నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 70 ఏండ్ల వయసున్న నల్ల త్రాచు హల్చల్..!!#Konaseema #Snake #ViralWatch #Oneindia #OITelugu
— oneindiatelugu (@oneindiatelugu) November 30, 2025
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం (మహిపాల చెరువు)లో ఐదడుగుల నల్లతాచుపాము కలకలం సృష్టించింది. పొలంలోని గడ్డి కుప్పలోకి చేరిన పామును స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ… pic.twitter.com/vcxZxMcs3u
ఒకవేళ ఎవరికైనా ఇళ్లలో లేదా సమీపంలో పాములు కనిపిస్తే వాటిని హింసించకుండా, వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని వర్మ కోరారు. తాను వాటిని పట్టుకుని, తిరిగి సురక్షితమైన అటవీ ప్రాంతాలలో విడిచిపెడతానని తెలిపారు.












Click it and Unblock the Notifications