రక్షణ కల్పించండి: కేతిరెడ్డి, ‘వెధవ’లంటూ లక్ష్మీపార్వతి తీవ్రవ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని 'లక్ష్మీస్ వీరగ్రంథం'సినిమా డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ, తెలంగాణ డీజీపీలను ఆయన కోరారు.

  NTR Biopic Controversies : ‘లక్ష్మీస్ వీరగ్రంథం’NTR ను అవమానించడానికే ?

  అవమానించేందుకే: 'లక్ష్మీస్ వీరగ్రంథం'పై కేతిరెడ్డికి లక్ష్మీపార్వతి వార్నింగ్

  లక్ష్మీపార్వతి తీరును ఎండగడతా..

  లక్ష్మీపార్వతి తీరును ఎండగడతా..

  రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. ఆయనకు పోలీసులు అనుమతివ్వలేదు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. లక్ష్మీపార్వతి తీరును ఎండగడతానని అన్నారు.

   వీళ్లేవరు..

  వీళ్లేవరు..

  ఇది ఇలా ఉండగా, ఒక మహిళకు పెళ్లైన తరువాత ఆమెపై కన్న తండ్రికి కూడా అధికారం ఉండదని.. అలాంటిది తన జీవితం గురించి సినిమా తీయడానికి వీళ్లంతా ఎవరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీపార్వతి.

  తల్లి, చెల్లి ఉన్నవారు..

  తల్లి, చెల్లి ఉన్నవారు..

  తనకు సంబంధం లేని వ్యక్తులు తన అనుమతి లేకుండానే తనపై సినిమా తీస్తున్నారని, 25ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి పేరును తన పక్కన చేర్చడం చట్ట విరుద్ధమని లక్ష్మీ పార్వతి అన్నారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని అన్నారు. తనకు ఎవరూ లేనప్పుడే వీరందరితో తాను ఒంటరిగా పోరాటం చేశానని.. ఇప్పుడు తన వెనుక ప్రజలు ఉన్నారని చెప్పారు.

  ఆ వెధవలకు దమ్ముందా..

  ఆ వెధవలకు దమ్ముందా..

  సినిమాను తీస్తున్న వ్యక్తులకు అంత సీన్ లేదని ఒకడు అప్పుల్లో ఉంటే, మరొకడు ప్లాట్ ఫామ్ వెధవ అని.. వీరికి సినిమా తీసే దమ్ము, ధైర్యం లేదని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి అడ్డమైన వెధవల్ని ముందు పెట్టి ఒక వ్యక్తి నాటకం ఆడిస్తున్నారని, ఆ వ్యక్తిని త్వరలో బయటకు తీసుకువస్తానని చెప్పారు. ఈ వ్యవహారంలో చట్టం సహాయం తీసుకోనున్నట్లు లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  తప్పిన ప్రమాదం: విశాఖ-హైదరాబాద్ విమానాన్ని ఢీకొన్న అడవిపంది, అసలేం జరిగిందంటే?

  బోటు విషాదం: 22మంది ప్రాణాలు తీసింది అధికారుల నిర్లక్ష్యమే?(వీడియో)

  డేరా బాబాకు రాజభోగాలు: తోటి ఖైదీ చెప్పిన సంచలన విషయాలు

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Lakshmis Veera Grantham cinema director kethireddy jagadishwar Reddy asked Telugu States DGPs to provide security for him.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి