Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మవారి అనుగ్రహం పొందాలంటే - పూజ, మంత్రం, ప్రసాదం..!!

ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆదివారం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దుర్గమ్మను కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం ప్రభుత్వం..ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమ్మవారి దర్శనం
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. కుడివైపున ల‌క్ష్మీదేవి, ఎడ‌మ వైపున స‌ర‌స్వ‌తీదేవి సేవ‌లు చేస్తుండ‌గా చెరకుగ‌డ‌, విల్లు, పాశాంకుశాల‌ను ధ‌రించి ఎరుపు, నీలం రంగు చీరలో ఓంకార రూపిణి అయిన అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః' అనే మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా అమ్మవారికి పులిహోర సమర్పించాలని అర్చకులు చెబుతున్నారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. బంగారు రంగు చామంతులతో అమ్మను పూజించాలి.

Goddess Kanaka Durga in Sri Lalita Tripura Sundari Devi alankaram atop Indrakeeladri

భారీగా భక్తులు
తన వద్దకు వచ్చే భక్తులకు అమ్మవారు చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కూడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుసుందరి దేవిగా అనుగ్రహిస్తుంది. అమ్మ శ్రీవిద్య స్వరూపిణి సృష్టి, స్థితి, సమ్మార, రూపిణి, కుంకుమతో నిత్యపూజలు చేసే సువాస్నులకు తల్లి మంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

కాగా, వీవీఐపీ దర్శనాలు అరగంటలో పూర్తవుతుంటే, సామాన్య భక్తులకు నాలుగైదు గంటల సమయం పడుతోంది. ఈ ఏడాది అమ్మవారికి ఇచ్చే కానుకల సంఖ్య పెరిగింది. ఆదివారం నుంచి 30వేల మంది భక్తులకు పాలు, మజ్జిగ అందిస్తామని, భక్తుల రద్దీ మేరకు లడ్డూలు అందుబాటులో ఉంచుతామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+