ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అయితే ఈ రంగుల బట్టలు ధరించండి; జాబ్ పక్కా!!
ఏదైనా ఉద్యోగం రావాలి అంటే ముందుగా ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలి. ఇంటర్వ్యూ నిర్వహించేవారి ముందు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు హాజరు కావాలి. ఆ 15 నిమిషాలు మీపై ఉద్యోగం ఇచ్చే వ్యక్తి పాజిటివ్ గా ఉండాలి అంటే ముందు మన డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలో చూసుకోవాలి.
ఎలా పడితే అలా ఉద్యోగం కోసం వెళ్ళకూడదు. ఏ రంగు బట్టలు వేసుకుంటే అవతలి వ్యక్తికి మన పైన సానుకూల దృక్పథం ఏర్పడుతుందో తెలుసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రంగులు అవతలి వ్యక్తి మన విషయంలో సానుకూలంగా స్పందించేలా చేస్తాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్లేవారు నేవీ బ్లూ, బ్లూ డ్రెస్ వేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

ఈ రంగు ఇంటర్వ్యూలకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. అలాగే గ్రే కలర్ సూట్ లు కూడా ఇంటర్వ్యూ లకు వెళ్లే వాళ్లకి సానుకూల ఫలితాలను ఇస్తాయి. గ్రే కలర్ డ్రెస్ సానుకూల ప్రతిస్పందనను కలిగించడంలో దోహదం చేస్తుంది. ఇక ఇంటర్వ్యూ లకు వెళ్లే మహిళలు అయితే బ్రౌన్ కలర్ డ్రెస్ లేదా కుర్తా వేసుకుని ఇంటర్వ్యూ లకు వెళ్లడం మంచిదని చెప్పబడింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలు ఉన్న ఇండస్ట్రీలో చేరాలనుకుంటే లేదా సృజనాత్మకత అవసరమైన ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తే మాత్రం పొరపాటున కూడా బ్రౌన్ కలర్ డ్రెస్ లు వేసుకోకూడదు. ఇక ఉన్నత స్థానానికి లేదా పర్యావరణహిత, సాంప్రదాయ బద్ధంగా ఉన్న ప్రదేశంలో ఉద్యోగం చేయడానికి వెళుతున్నట్లు అయితే నలుపు రంగు దుస్తులను వేసుకోవడం మంచిదని సలహా ఇవ్వబడింది.
తెలుపు రంగు, గోధుమ రంగు దుస్తులు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సానుకూల ఫలితాలను ఇస్తాయి. పురుషులు మంచి ఫార్మల్ షర్టు ధరించి ఇంటర్వ్యూ కి వెళ్లడం మంచిది. స్త్రీలు కూడా ఫార్మల్ దుస్తులను, లేదా కుర్తాలను ధరించి ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. మనం వేసుకునే రంగులే అవతల వారి మనసులో సానుకూల, ప్రతికూల అభిప్రాయాలను కలిగిస్తాయని నమ్మండి. అందుకే దుస్తుల రంగుల విషయంలో జాగ్రత్త తీసుకోండి.












Click it and Unblock the Notifications