మరోమారు గోనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు; బాలినేనికి కౌంటర్!!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో చర్చనీయాంశంగా మారిన గోనె ప్రకాశ్ రావు ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల పై ఆయన తనదైన శైలిలో మండిపడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాండురంగ మహత్యం, వాల్మీకి వంటి సినిమాలు చూడాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక తాను ఇంతకు ముందు మాట్లాడిన వ్యాఖ్యలపై మాట్లాడిన గోనె ప్రకాశ్ రావు అవినీతి విషయంలో జగన్ కు జరిమానా పడుతుందని మాత్రమే తాను చెప్పానని, జగన్, భారతి జైలుకు వెళతారని తాను చెప్పలేదని దానిని వక్రీకరించారని పేర్కొన్నారు. తాను బాలినేనిని విమర్శించానని బాలినేని చెబుతున్నారని కానీ తాను బాలినేనిపై ఎటువంటి విమర్శలు చేయలేదని ఆయనను ఎన్నడూ కించపరచలేదు అని గోనె ప్రకాశ్ రావు వెల్లడించారు. అవినీతి చేసిన వారి పేర్లు మాత్రమే చెప్పానన్నారు.
ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పైన మాట్లాడిన గోనె ప్రకాశ్ రావు బాబాయ్ ని చంపితే దిక్కులేదని, నిందితులను రక్షించే పనిలో జగన్ ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. వైయస్ భారతి కోసమే తల్లి విజయమ్మను, సోదరి షర్మిల ను సాగనంపారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఇక రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని గోనె ప్రకాష్ వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి టిడిపి జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని, టిడిపి జనసేన కలవకపోయినా వచ్చే ఎన్నికలలో టిడిపి వంద సీట్లతో విజయం సాధిస్తుందని గోనె ప్రకాశ్ రావు పేర్కొన్నారు. వచ్చేఎన్నికలలో వైసిపి పరాజయం పాలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications