దీపావళి వేళ ఏపీలో మద్యం ధరలపై మందుబాబులకు శుభవార్త!
ఏపీ ప్రభుత్వం మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు లోకి వచ్చిన నాటినుండి ఏపీ ప్రభుత్వం నాణ్యతతో కూడిన మద్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం పైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మద్యం ధరలు తగ్గించే ఆలోచన పైన మందు బాబులకు శుభవార్త చెప్పారు.
ధరల తగ్గింపుకు కమిటీ
ప్రభుత్వ మద్యం ధరలు తగ్గించే ఆలోచన చేస్తుందని చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఇక మద్యం షాపులలో డిజిటల్ పేమెంట్స్ ను అనుమతిస్తామని పేర్కొన్నారు .అనుమతి లేకుండా పబ్ లలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

వారికి మంత్రి హెచ్చరిక
రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం దుకాణాలలో ఎమ్మార్పీ కే మద్యం బాటిల్స్ అమ్మాలని, ఎవరైనా అధిక ధరలకు విక్రయించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
పారదర్శకతతో మద్యం షాపుల నిర్వహణ
ఇక ఇదే సమయంలో గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందని , డిస్టిలరీ లను, తయారీ సంస్థలను ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుని, వాళ్ల సొంత ఆదాయం కోసం పనిచేశారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నూతన మద్యం విధానం ద్వారా పారదర్శకతతో మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

త్వరలోనే మద్యం ధరలు తగ్గిస్తాం
నాణ్యత ఉన్న లిక్కర్ ను, తక్కువ ధరకు అందించడం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే కమిటీ సూచనలను మేరకు మద్యం ధరలు మరింత తగ్గిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడలేదని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ విధానంలో చోటు చేసుకున్న అక్రమాల మీద విచారణ జరిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Dry Day: మందు బాబులకు షాక్.. వాహనదారులకు అలర్ట్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications