తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. అక్కడ నుండి ప్రయాణం ఉచితం!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల పైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళుతూ ఉంటారు. అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం వద్ద అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ టిటిడి భక్తులకు స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. అయితే మరింత మెరుగైన వసతులను కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్న టిటిడి తిరుమల శ్రీవారి భక్తులకు తాజాగా శుభవార్త చెప్పనుంది.

భక్తుల సౌకర్యం కోసం టీటీడీ కొత్త ఆలోచన
తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు దగ్గరకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులను, ఆటోలను, లేదా క్యాబ్ లను ఆశ్రయించవలసి వస్తుంది. దీంతో భక్తులు జేబులు గుల్ల అవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న టిటిడి భక్తులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తున్న ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం కొత్త ఆలోచనలు చేస్తుంది.

Good news for tirumala devotees Free Travel from tirupati to srivari metlu

Take a Poll

అక్కడ నుండి ఉచిత బస్సులు
తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఆ మార్గాల వరకు టీటీడీ ఉచిత బస్సులను నడపాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
తిరుపతి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో కొత్తగా 20 ఎలక్ట్రిక్ బస్సులను నడప నున్నట్టు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే యోచన
ఈ బస్సులలో తిరుపతిలోని రైల్వే స్టేషన్ నుండి, అలాగే బస్టాండ్ నుండి కాలినడక ద్వారా వెళ్లే భక్తులను అలిపిరి మీదుగా, శ్రీవారి మెట్టు వరకు ఉచితంగా తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే టిటిడి ఆధ్వర్యంలో ఉచిత ధర్మ రథం బస్సులను ఏర్పాటు చేశారు. అయితే అవి భక్తుల రద్దీకి తగినట్లుగా లేకపోవడంతో మళ్ళీ త్వరలో పాలకమండలి సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

దాతల సహకారంతో ఉచిత బస్సులను నడిపే ప్లాన్
టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈ మేరకు సమాలోచనలు జరుపుతున్నట్లు, దాతల సహకారంతో ఈ మార్గాలలో ఉచిత బస్సులను నడపడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా దీనిపైన అధికారకంగా ప్రకటన ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ నిర్ణయం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వారిపైన ఆర్థిక భారాన్ని కాస్త తగ్గించినట్లు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+